Megastar Chiranjeevi: గాడ్ ఫాదర్ నుంచి క్రేడీ అప్డేట్.. ఆ విషయంలో మెగాస్టార్‏తో పోటీపడిన లేడీ సూపర్ స్టార్ ?..

|

Jul 10, 2022 | 1:24 PM

ఈ సినిమాలో చిరుకు.. నయనతారకు మధ్య వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయని.. అందులో చిరుతో నయన్ పోటీపడి మరీ నటించినట్లుగా టాక్ వినిపిస్తోంది.

Megastar Chiranjeevi: గాడ్ ఫాదర్ నుంచి క్రేడీ అప్డేట్.. ఆ విషయంలో మెగాస్టార్‏తో పోటీపడిన లేడీ సూపర్ స్టార్ ?..
Megastar Chiranjeevi
Follow us on

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాలలో గాడ్ ఫాదర్ (God Father) ఒకటి. డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార కీలకపాత్రలో  నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గాడ్ ఫాదర్ నుంచి విడుదలైన చిరు ఫస్ట్ లుక్.. గ్లింప్స్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరుకు.. నయనతారకు మధ్య వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయని.. అందులో చిరుతో నయన్ పోటీపడి మరీ నటించినట్లుగా టాక్ వినిపిస్తోంది. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ మోహన్ రాజా. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.