తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కట్టుబాట్లను కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా బలగం. జబర్దస్త్ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి మొదటి సారి మెగాఫోన్ పట్టి ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించారు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించారు. మార్చి 3న చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం సూపర్‌హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆతర్వాత ఓటీటీలోనూ దుమ్ము రేపింది. తెలంగాణలోని చాలా పల్లెల్లో పెద్ద పెద్ద ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటుచేసుకుని మరీ బలగం సినిమాను వీక్షిచారంటే ఈ మూవీ ఎంతలా జనాల్లోకి ఎవళ్లిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక అంతర్జాతీయంగానూ ఈ సినిమాకు అవార్డులు క్యూ కట్టాయి. తాజాగా బలగం సినిమాపై తెలంగాణలో జరిగిన కానిస్టేబుల్ రాతపరీక్షలో ఓ ప్రశ్న కూడా వచ్చింది. ఈనెల 30న జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రశ్నను అడిగారు.
అదేంటంటే.. మార్చి 2023లో ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో బలగం సినిమాకు ఏ విభాగంలో పురస్కారం లభించింది? అని ప్రశ్న అడిగారు. ఈ అబ్జెక్టివ్ టైప్ ప్రశ్నకు ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ నాటకం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంభాషణ అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు ఉత్తమ నాటకం అనేది సరైన సమాధానం. ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో బలగం మూవీకి ఉత్తమ నాటకం విభాగంలో అవార్డ్ దక్కింది. ఈ పురస్కారంతో సహా వేణు సినిమాకు అంతర్జాతీయంగా మొత్తం 40 పురస్కారాలు దక్కాయి. మొత్తానికి బలగం సినిమాకు ఇంకా ఆదరణ ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది.
Thank you so much Anil Anna for the felicitation. It was truly special. My heartfelt greetings to the entire team of Telangana Film Development Copration. ??#balagam #balagamonprime @Anilkurma143 @KTRBRS pic.twitter.com/gyFdlBOO8Z
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) April 24, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..