F3 Movie: సెంటిమెంట్‏ను నమ్ముకుంటున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. ఎఫ్ 3 సినిమా విడుదలయ్యేది అప్పుడేనా..

|

Apr 28, 2021 | 3:12 PM

F3 Movie Update: కరోనా వల్ల కష్టాలే కాదు.. కలిసివచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వెంకీ, వరుణ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి

F3 Movie: సెంటిమెంట్‏ను నమ్ముకుంటున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. ఎఫ్ 3 సినిమా విడుదలయ్యేది అప్పుడేనా..
F3 Movie
Follow us on

F3 Movie Update: కరోనా వల్ల కష్టాలే కాదు.. కలిసివచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వెంకీ, వరుణ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్‍లో వస్తున్న మూవీ.. ఎఫ్ 3. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుని.. విడుదలకు కు సిద్ధమైన సమయంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చిపడింది. దీంతో ఈ మూవీ రిలీజ్ పై డైరెక్టర్ తన సెంటిమెంట్‏ను నమ్ముకుంటున్నట్లుగా తెలుస్తోంది. 2019 సంక్రాంతి బరిలో నిలిచి గెలిచిన మూవీ.. ఎఫ్ 2. కామెడీ జోనర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది. పూర్తిస్థాయి నవ్వుల విందును పంచుతూ.. భారీ కమర్షియల్ హిట్ గా నిలిచింది. అయితే ఇదే కాంబినేషన్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎఫ్ 2 సిక్వెల్ గా ఎఫ్ 3 మూవీ చేస్తున్నాడు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకున్న ఎఫ్ 3 సినిమా.. ఈ ఆగస్టులో విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. ప్రస్తుతం ఈ సినిమా పనులు ఆగిపోయాయి. దీంతో ముందు అనుకున్న సమయానికి ఎఫ్ 3 చిత్రం విడుదల కావడం లేదట.

ఎఫ్ 2 తర్వాత డైరెక్టర్ అనిల్.. సరిలేరు నీకెవ్వరూ అంటూ మహేశ్ తో చేసిన మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ అయి.. సక్సెస్ అయ్యింది. ఇటు ఎఫ్ 2, అటు మహేశ్ మూవీ రెండూ సూపర్ హిట్ కావడంతో.. అనిల్ రావిపూడికి సంక్రాంతి డైరెక్టర్ అనే పేరు వచ్చింది. దీంతో ఎఫ్ 3 మూవీని కూడా వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. మరోసారి తన సెంటిమెంట్ తోనే ముందుకు వెళ్తేనే.. విజయం వరిస్తుందని నమ్ముతున్నాడట అనిల్ రావిపూడి. మరీ ఈసారి కూడా అనిల్ రావిపూడి సూపర్ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి. అయితే ఈ ఎఫ్3లో సినిమా కథ డబ్బు సంపాదన చుట్టూ తిరుగుతుందట. ఆ సందర్భంగా వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్విస్తాయని అంటున్నారు. ఇందులో సునీల్ పాత్ర ప్రత్యేక ఆకర్షణ అవుతుందట.

Also Read: Happy Birthday Samantha: పెళ్లి తర్వాత కూడా తగ్గని అక్కినేని కోడలు హావా… బర్త్ డే గర్ల్ బ్యూటిఫుల్ పిక్స్..

చిత్రపరిశ్రమలో కోవిడ్ అలజడి.. కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి.. విషాదంలో సినీ వర్గాలు..