
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ల ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది.
ఈ సందర్భంగా మేకర్స్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (రీజనల్ ఫిల్మ్స్) సెలబ్రేషన్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో సినిమా యూనిట్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కి షీల్డ్స్ అందించారు. దర్శకులు కె రాఘవేంద్రరావు, వివి వినాయక్, నిర్మాత దిల్ రాజు, సుప్రియ యార్లగడ్డ పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో కీలక పాత్రలో నటించారు వెంకటేష్. చిరంజీవి, వెంకీ సీన్స్ కు థియేటర్స్ లో ఆడియన్స్ పడిపడి నవ్వుకున్నారు. ఇక ఈ సక్సెస్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ..
సంక్రాంతికి వచ్చి చిరంజీవి గారు ధనాధన్ చేశారు అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ థాంక్యూ. మీ అందరి ఆదరణతో ఈ సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ అయింది. అన్ని ఆల్‌టైమ్ రికార్డ్స్‌కి చిరంజీవి గారు అర్హులు. ఇంత అద్భుతమైన సినిమాలో ని భాగమవడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ అనిల్ కి థాంక్యూ. ఆయన టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఈ సినిమాకి పని చేసినమిగతా టెక్నీషియన్స్ అందరికీ కంగ్రాజులేషన్స్. మంచి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన సుస్మిత, సాహుకి కంగ్రాట్స్. ఇలాంటి విజయాలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు ఎప్పుడు కూడా మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్స్ ని ప్రోత్సహిస్తారు. ఈసారి కూడా ఎంకరేజ్ చేసినందుకు చాలా థాంక్స్. ఇక్కడికి విచ్చేసిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిక్యూటివ్స్ అందరికీ అభినందనలు. ఎప్పుడు సంక్రాంతికి వస్తూనే ఉంటాం ధనాధన్ ఇస్తూనే వుంటాం అని వెంకీ అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..