Daggubati Venkatesh: పెళ్లికళ వచ్చేసిందే బాల.. వెంకటేష్ ఇంట వివాహమహోత్సవం

రీసెంట్ గా మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. నిన్ననే మరో కుర్ర హీరో కిరణ్ అబ్బవరం కూడా నటి రహస్యతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. తాజాగా సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వెంకటేష్ కూతురు పెళ్ళికి రెడీ అయ్యింది.

Daggubati Venkatesh: పెళ్లికళ వచ్చేసిందే బాల.. వెంకటేష్ ఇంట వివాహమహోత్సవం
Venkatesh

Updated on: Mar 14, 2024 | 4:30 PM

టాలీవుడ్ లో మరోసారి పెళ్లిబాజాలు వినిపించనున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలోని యంగ్ హీరోలు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. రీసెంట్ గా మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. నిన్ననే మరో కుర్ర హీరో కిరణ్ అబ్బవరం కూడా నటి రహస్యతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. తాజాగా సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వెంకటేష్ కూతురు పెళ్ళికి రెడీ అయ్యింది. వెంకటేష్ కు ముగ్గురు కుమార్తెలు ఓ కుమారుడు ఉన్న విషయం తెలిసిందే. మొదటి కూతురికి ఇప్పటికే వివాహం కాగా ఇప్పుడు రెండో కూతురు కూడా పెళ్ళికి రెడీ అయ్యింది.

వెంకటేష్ రెండో కూతురు హయవాహిని ఎంగేజ్ మెంట్ గత ఏడాది అక్టోబర్ లో జరిగింది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ తో హయవాహిని ఎంగేజ్ మెంట్ జరిగింది ఈ వేడుక చాలా సింపుల్ గా జరిగింది. ఇక ఇప్పుడు పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. మార్చ్ 15న ఈ వివాహం జరగనుందని తెలుస్తోంది.

హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో వెంకటేష్ రెండో కూతురు హయవాహిని వివాహం జరగనుంది. ఈ వేడుకకు కొద్దిమంది టాలీవుడ్ సెలబ్రెటీలు హాజరుకానున్నారు. ఈవిషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతున్నారు. కుటుంబసభ్యులు, కొంతమంది సన్నిహితుల మధ్య ఈవేడుక జరగనుంది. అయితే ఈ పెళ్లి ఫోటోలు బయటకు వస్తేనే దీని పై క్లారిటీ వస్తుంది. వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రితకు 2019లో పెళ్లి జరిగింది. జైపూర్‌లో ఈవేడుక ఘనంగా జరిగింది.

వెంకటేష్ ట్విట్టర్ పోస్ట్..

వెంకటేష్ ట్విట్టర్ పోస్ట్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.