సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పిన తక్కువే.. స్టార్ హీరోగా మహేష్ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా వస్తుందట ఫాన్స్ పూనకాలతో ఊగిపోతుంటారు. ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతోన్న మహేష్ రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లీక్డ్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. ఇదిలా ఉంటే మహేష్ కు సంబంధించిన ఒక ఓల్డ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పై ఫోటోను గమనించారా.?
మహేష్ బాబు మూవీ ఓపినింగ్ కు వెంకటేష్, కింగ్ నాగార్జున హాజరయ్యారు. అది ఈమూవీనో తెలుసా.. మహేష్ నటించ ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్లూ కావాలంటే ఆ సినిమా నుంచే మహేష్ కు పిన్స్ అనే ట్యాగ్ క్రియేట్ అయ్యింది.
ఇంతకు అది ఏ సినిమా అంటే.. యువరాజు. మహేష్ బాబును లవర్ బాయ్ గా మరో మెట్టు పైకెక్కించింది ఈ సినిమా. ఈ సినిమాకు వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాలో సిమ్రాన్, సాక్షిశివానంద్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా హీరోగా మహేష్ సెకండ్ మూవీకావడం విశేషం. ఈ సినిమా ఓపినింగ్ కు వెంకటేష్, నాగార్జున హాజరయ్యారు. ఆ ఓల్డ్ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.