Venkatesh BirthDay : విక్టరీ వెంకటేష్ టాలీవుడ్‌కు ఎంతమంది హీరోయిన్స్‌ను పరిచయం చేశారో తెలుసా..

రామానాయుడు కొడుకుగా వెంకటేష్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించి ఆకట్టుకున్నాడు.

Venkatesh BirthDay : విక్టరీ వెంకటేష్ టాలీవుడ్‌కు ఎంతమంది హీరోయిన్స్‌ను పరిచయం చేశారో తెలుసా..
Venkatesh

Updated on: Dec 13, 2023 | 11:18 AM

దగ్గుబాటి వెంకటేష్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు వెంకటేష్. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు తనయుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్. రామానాయుడు కొడుకుగా వెంకటేష్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించి ఆకట్టుకున్నాడు. నేడు వెంకటేష్ పుట్టిన రోజు. దాదాపు 70కి పైగా సినిమాలలో నటించిన ఈయన 7 నంది అవార్డులు గెలుచుకున్నాడు వెంకటేష్.

ఫ్యామిలీ హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు వెంకటేష్. అంతే కాదు చాలా మంది స్టార్ హీరోయిన్స్ ను టాలీవుడ్ కు పరిచయం చేశారు వెంకటేష్. ఫరా, టబు, దివ్యభారతి, గౌతమి, ప్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలా జవేరి, ఖుష్బూ ఇలా చాలా మంది హీరోయిన్స్ ను పరిచయం చేశారు వెంకటేష్. సౌందర్యతో కలిసి వెంకటేష్ ఏడూ సినిమాల్లో నటించారు. అలాగే మీనాతో కలిసి ఆరు సినిమాల్లో నటించారు వెంకటేష్. వెంకటేష్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసారు.

ఆయన దర్శకత్వంలో వచ్చిన కలియుగపాండవులు సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యారు వెంకటేష్. ప్రేమ, ధర్మచక్రం, చంటి, స్వర్ణకమలం, గణేష్, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలు వెంకటేష్ కు నంది అవార్డులను అందుకున్నారు. ఎలాంటి పాత్రలనైనా సునాయాసం గా చేసి ప్రేక్షకులను మెప్పించగల నటుడు వెంకటేష్. ఆయన సినీ కెరీర్ లో ఫ్యామిలీ సినిమా, యాక్షన్ సినిమాలు చాలా చేశారు. అలాగే యంగ్ హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. ప్రస్తుతం సైందవ్ అనేసినిమా చేస్తున్నారు వెంకటేష్. ఈ సినిమా జనవరి లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..