Venkatesh : కుమ్మేసిన వెంకీ మామ.. మూవీ టైటిల్ కూడా అదిరిపోయిందిగా..

ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరిగితుంది. ఈ సినిమా నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ టైటిల్ ను అలాగే ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు

Venkatesh : కుమ్మేసిన వెంకీ మామ.. మూవీ టైటిల్ కూడా అదిరిపోయిందిగా..
Venkatesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 01, 2024 | 11:40 AM

వికటరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలుసిందే.. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు తెరకెక్కయి. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరిగితుంది. ఈ సినిమా నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ టైటిల్ ను అలాగే ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇక ఈ సినిమా నుంచి తాజాగా టైటిల్‌తో పాటు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను సంక్రాంతికి వస్తున్నాం అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి. అలాగే ఈ సినిమాలో కావాల్సినంత యాక్షన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. అలాగే అనిల్ తన మార్క్ కామెడీతోనూ ఆకట్టుకోనున్నాడు.

తాజాగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ లో వెంకటేష్ పంచ ఎగ్గట్టి అదరగొట్టారు. ఓ వైపు ఐశ్వర్యా రాజేష్ , మరో వైపు మీనాక్షి చౌదరి కనిపిస్తున్నారు. అలాగే వెంకటేష్ చేతిలో గన్ చూపించారు. చూస్తుంటే ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ తో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.