KA Movie Review: కిరణ్ అబ్బవరం చెప్పి మరీ కొట్టాడు.. క సినిమా ఎలా ఉందంటే

క సినిమా దీపావళి కానుకగా.. తాజాగా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కిరణ్ అబ్బవరానికి క.. హిట్టిస్తుందా? లేదా..? తెలియాలంటే.. ఈ రివ్యూ చూడాల్సిందే..!

Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 01, 2024 | 12:02 PM

నిన్న మొన్నటి వరకు హిట్స్.. ప్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసిన కిరణ్ అబ్బవరం.. కాస్త గ్యాప్ తీసుకుని.. ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని చేసిన ఫిల్మ్ ‘క’. టైటిల్ అనౌన్స్‌ మెంట్ దగ్గర నుంచే.. టీజర్, ట్రైలర్‌తో.. సినిమాపై ఓ రేంజ్‌ అంచనాలను పెంచేసిన ఈ సినిమా దీపావళి కానుకగా.. తాజాగా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కిరణ్ అబ్బవరానికి క.. హిట్టిస్తుందా? లేదా..? తెలియాలంటే.. ఈ రివ్యూ చూడాల్సిందే..!

క కథ లోకి వెళితే.. అభినయ వాసుదేవ్ అలియాస్ కిరణ్ అబ్బవరం అనాథ. ఎప్పటికైనా తన తల్లిదండ్రులు తిరిగొస్తారన్న ఆశతో జీవిస్తుంటాడు. ఇతరుల ఉత్తరాలు చదువుతూ.. వాటిని తన సొంత వాళ్లే రాసినట్లు ఊహించుకుంటూ.. ఆ రాతల్లో తాను పోగొట్టుకున్న బంధాల్ని చూసుకుంటాడు. కట్ చేస్తే.. పెద్దయ్యాక కొన్నాళ్లకు.. వాసు కృష్ణగిరి అనే ఊరికి వచ్చి అక్కడ కాంట్రాక్ట్ పోస్ట్‌మెన్‌గా ఉద్యోగంలో చేరతాడు. ఈ క్రమంలోనే పోస్ట్‌మాస్టర్ రంగారావు అలియాస్ అచ్యుత్ కుమార్ కూతురు సత్యభామ అలియాస్ నయన సారికతో ప్రేమలో పడతాడు. మరోవైపు ఆ ఊళ్లో అమ్మాయిలు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోతుంటారు. అయితే ఉత్తరాలు చదివే అలవాటున్న వాసుకు ఓ లెటర్ వల్ల ఈ మిస్సింగ్ కేసులకు సంబంధించిన క్లూ ఒకటి దొరుకుతుంది. అక్కడి నుంచి వాసుదేవ్ జీవితం సమస్యల్లో చిక్కుకుంటుంది. మరి ఊరి అమ్మాయిలు కనిపించకుండా పోవడానికి కారణమెవరు? వాసుతో పాటు టీచర్‌ రాధ అలియాస్ తన్వి రామ్‌ను కిడ్నాప్ చేసి వేధించే ముసుగు వ్యక్తి ఎవరు? వీటన్నింటి మధ్యలో.. వాసుదేవ్ – సత్యభామల ప్రేమకథ ఏమైంది? అనేది మిగిలిన కథ.

క – లాంటి కాన్సెప్టు ఇంత వరకూ రాలేదు.. అలా వచ్చిందని నిరూపిస్తే సినిమాలు మానేస్తా.. ఇది ఈసినిమా గురించి ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో .. ఇంటర్వ్యూల్లో కిరణ్ అబ్బవరం చెప్పిన మాట. అయితే ఈ మాటే.. దాదాపుగా నిజం అయింది. సినిమా నిజంగానే యూనిక్‌గా ఉంది. దర్శకులు సుజీత్- సందీప్‌ ఎంచుకున్న కథ.. నాన్‌లీనియర్ స్టైల్‌లో దాన్ని నడిపిన తీరు.. ఈ కథను సెట్ చేసిన కృష్ణగిరి ఊరు.. అందులోని సమస్య.. దాన్ని పరిష్కరించే క్రమంలో హీరోకి ఎదురయ్యే సవాళ్లు.. వేటికవే ఆకట్టుకుంటాయి. అయితే సినిమా అంతా ఒకెత్తైతే ఇంటర్వెల్ సీన్స్ మరొక ఎత్తు. క్లైమాక్స్‌ అయితే అంతకు మించి. ఇంకో మాటలో చెప్పాలంటే.. ఈ రెండు సందర్భాల్లో సినిమా చూస్తున్న సగటు ఆడియన్‌కు బుర్ర తిరిగిపోద్ది. పక్కాగా కొత్త అనుభూతినైతే ఇస్తుంది. ముఖ్యంగా మనిషి పుట్టుక.. కర్మ ఫలం.. రుణానుబంధం.. ఈ మూడు అంశాల్ని ముడిపెట్టి ఇద్దరు దర్శకులు చెప్పిన సందేశం.. తమ కథను ముగించిన తీరు ఎక్స్‌లెంట్ అనిపిస్తుంది.

ఇక హీరోని ముసుగు వ్యక్తి కిడ్నాప్ చేసి.. చీకటి గదిలో బంధించడంతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆ గదిలో ముసుగు వ్యక్తి ఓ యంత్రం సాయంతో హీరోని జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లి తన ఒక్కో ప్రశ్నకు సమాధానం చెప్పించే తీరు.. ఈ క్రమంలో హీరో కథను పరిచయం చేసిన విధానం ఆకట్టుకుంటాయి. వాసు.. కృష్ణగిరికి వచ్చాకే అసలు కథ ఆరంభమవుతుంది. ఊళ్లో అమ్మాయిలు కనిపించకుండా పోవడం.. వాసు – రాధల మధ్య నడిచే కథ ఇలా ప్రతి సీన్ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ ను క్రియేట్ చేస్తుంది. ఈ క్రమంలో వచ్చే ఇంటర్వెల్ సీన్ .. సెకండ్ ఆఫ్ పై విపరీతమైన అంచనాలు పెంచేస్తుంది. ఊళ్లో అమ్మాయిలు కనిపించకుండా పోవడానికి కారణమెవరు? అలా మాయమవుతున్న అమ్మాయిలు ఏమవుతున్నారు? ముసుగు వ్యక్తి చెర నుంచి వాసుదేవ్ – రాధ ఎలా బయటపడ్డారన్న యాంగిల్లో సెకండ్ ఆఫ్ సాగుతుంది. ఈ మధ్యలో వచ్చే కోర్టు యాక్షన్ సీక్వెన్స్, జాతర పాట.. క్లైమాక్స్ ఫైట్ మాస్ ప్రేక్షకులకు కిక్కిస్తాయి. ఇక ఎగ్జాక్ట్ అక్కడి నుంచే 15 నిమిషాలు కథ ఊహించని మలుపు తిరుగుతంది. భావోద్వేగాలతో మదిని బరువెక్కిస్తుంది. ఇక ముగింపు ఓ కొత్త అనుభూతిని అందిస్తూ.. చప్పట్లు కొట్టించేలా చేస్తుంది.

ఇది కిరణ్ అబ్బవరం కెరీర్‌ను మలుపు తిప్పే సినిమా. అభినయ వాసుదేవ్‌గా కిరణ్ తన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఎమోషన్ సన్నివేశాల్లోనూ తనదైన నటనతో కట్టిపడేశారు. నయన సారిక క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది. వీళ్లద్దరి మధ్య ఉన్న లవ్‌ ట్రాక్ మాత్రం యావరేజ్‌. నిజానికి ఇది పూర్తిగా దర్శకులు సుజీత్- సందీప్‌ల సినిమా. పూర్తిగా కాన్సెప్ట్‌, స్క్రీన్‌ప్లే బేస్డ్‌గా సాగింది. ఫస్ట్ ఆఫ్ .. సెకండ్ ఆఫ్‌లో కొన్ని మైనస్‌లు ఉన్నా.. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌తో అవన్నీ పక్కకు వెళ్లిపోతాయి. సామ్ సిఎస్ మ్యూజిక్… పాటలన్నీ బాగున్నాయి. అయితే అందులో జాతర పాట మాస్‌ను ఊపేస్తుంది. ఇక ఇవన్నీ కాదు.. ఈ సినిమా గురించి ఫైనల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే మాత్రం..! క.. కిక్కిస్తూనే.. మిమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేసే సినిమా.

కేకేఆర్ వద్దంది.. కట్‌చేస్తే.. 34 బంతుల్లో మ్యాచ్ క్లోజ్ చేశాడు
కేకేఆర్ వద్దంది.. కట్‌చేస్తే.. 34 బంతుల్లో మ్యాచ్ క్లోజ్ చేశాడు
గోల్డెన్ లగ్జరీ రైలు.. ఇందులో 7 స్టార్ హోటల్ తరహాలో సదుపాయాలు!
గోల్డెన్ లగ్జరీ రైలు.. ఇందులో 7 స్టార్ హోటల్ తరహాలో సదుపాయాలు!
దొంగలను పట్టించే ఆలయం.. ఈ విషయం తెలుసుకున్న దొంగలు ఏం చేశారంటే
దొంగలను పట్టించే ఆలయం.. ఈ విషయం తెలుసుకున్న దొంగలు ఏం చేశారంటే
మీ ఇంటి పెరట్లో ఈ మొక్క ఉంటే చాలు.. షుగర్, కీళ్ల నొప్పులకు చెక్‌
మీ ఇంటి పెరట్లో ఈ మొక్క ఉంటే చాలు.. షుగర్, కీళ్ల నొప్పులకు చెక్‌
మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో ఎవరికీ తెలియదు..
మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో ఎవరికీ తెలియదు..
ఆశలు చచ్చిపోయాయన్న కావ్య.. కనకం ఇంటికి అపర్ణ!
ఆశలు చచ్చిపోయాయన్న కావ్య.. కనకం ఇంటికి అపర్ణ!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
సైబర్ కేటుగాళ్లకే షాక్ ఇచ్చిన సామాన్యుడు.. !
సైబర్ కేటుగాళ్లకే షాక్ ఇచ్చిన సామాన్యుడు.. !
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
Video: థర్డ్ అంపైర్ నిర్ణయంపై హీటెక్కిన సోషల్ మీడియా..
Video: థర్డ్ అంపైర్ నిర్ణయంపై హీటెక్కిన సోషల్ మీడియా..
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు