Empuraan: లాల్ లూసిఫర్‌ సీక్వెల్ వచ్చేస్తుంది.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన స్టార్ హీరో

మోహన్ లాల్ లూసిఫర్‌ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది.

Empuraan: లాల్ లూసిఫర్‌ సీక్వెల్ వచ్చేస్తుంది.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన స్టార్ హీరో
Empuraan
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 01, 2024 | 12:17 PM

మాలీవుడ్ హీరో మోహన్ లాల్ సినిమాలకు మలయాళంలోనే కాదు ఇతరభాషల్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక మోహన్ లాల్ లూసిఫర్‌ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. లూసిఫర్‌ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ పేరుతో ఈమెకు చేశారు. గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ గా నటించి మెప్పించారు. కాగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు లూసిఫర్‌ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు.

లూసిఫర్‌ రెండో భాగం ‘ఎంపురాన్‌’ విడుదల తేదీని ప్రకటించారు. ఈ విషయాన్ని దర్శకుడు పృథ్వీరాజ్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. దీంతో అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. లూసిఫెర్ ఫ్రాంచైజీలో రెండవ చిత్రం ఎంపురాన్ మార్చి 27, 2025న థియేటర్లలోకి రానుందని పృథ్వీరాజ్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. కొత్త పోస్టర్ కూడా షేర్ చేశాడు

పోస్టర్‌లో తెల్ల చొక్కా ధరించి వెనుకకు తిరిగిన వ్యక్తిని చూపించారు. చొక్కా పై ఎరుపు డ్రాగన్, దాని చుట్టూ ఫైర్ ఉంది. దీంతో అభిమానులు అతను ఎవరా..? అని తీస్తున్నారు. అతను ఎంపురాన్ విలన్ అయ్యి ఉంటాడని టాక్ వినిపిస్తుంది. అతను ఫహద్ ఫాసిల్ అని కూడా కామెంట్ వినిపిస్తున్నాయి. భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన లైకా ప్రొడక్షన్స్, ఆంథోనీ పెరుంబవూర్ ఆశీర్వాద్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా కొచ్చిలో షూటింగ్ జరుపుకుంటుంది. గుజరాత్, హైదరాబాద్, తిరువనంతపురం, వండిపెరియార్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుని కొచ్చి వచ్చింది మూవీ టీమ్.  లూసిఫెర్ లో నటించిన మంజు వారియర్‌తో పాటు, టోవినో థామస్, సానియా అయ్యప్పన్, సాయి కుమార్, ఇంద్రజిత్ సుకుమారన్, బైజు, సూరజ్ వెంజరమూడ్, షైన్ టామ్ చాకో, షరాఫుద్దీన్, అర్జున్ దాస్ కూడా ఎంపురాన్‌లో నటిస్తున్నారు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!