Lucky Baskhar Movie: ఈ హీరో నిజంగానే లక్కీ.. మరో హిట్ కొట్టిన దుల్కర్ సల్మాన్

లక్కీ భాస్కర్ సినిమా కథ అంతా 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్ అలియాస్ దుల్కర్ సల్మాన్ ముంబయిలో మగధ అనే ప్రైవేటు బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తుంటాడు.

Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 01, 2024 | 12:25 PM

మహానటి, సీతారామం లాంటి సినిమాలతో తెలుగు హీరో అయిపోయాడు దుల్కర్ సల్మాన్. ఈయన నుంచి సినిమా వస్తుందంటే చాలు కచ్చితంగా బాగుంటుందనే నమ్మకాన్ని కలిగించాడు. తాజాగా లక్కీ భాస్కర్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సార్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కించిన సినిమా ఇది. మరి ఈ సినిమాతో దుల్కర్ తెలుగులో హ్యాట్రిక్ అందుకున్నాడా లేదా అనేది చూద్దాం..

లక్కీ భాస్కర్ సినిమా కథ అంతా 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్ అలియాస్ దుల్కర్ సల్మాన్ ముంబయిలో మగధ అనే ప్రైవేటు బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. ఇంట్లో అతడే పెద్ద కొడుకు.. చాలా బాధ్యతలుంటాయి. దాంతో జీతం సరిపోక అప్పులు చేస్తూ ఇంటిని నెట్టుకొస్తుంటాడు. ఇంటి మీదకు అప్పుల వాళ్లు వస్తే తప్పించుకుంటూ ఉంటాడు. ఇలా భాస్కర్ జీవితం గడుస్తూ ఉంటుంది. ఆయనకు భార్య సుమతి అలియాస్ మీనాక్షి చౌదరి, ఓ చిన్న కొడుకు ఉంటాడు. బ్యాంకులో వచ్చే జీతం సరిపోక ఏవో చిన్న చిన్న పార్ట్ టైమ్ బిజినెస్లు కూడా చేస్తుంటాడు. అలాంటి భాస్కర్ జీవితంలోకి ఒకసారి ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేసే ఆంటోనీ అలియాస్ రాంకీ వస్తాడు. తన జాబ్‌ను రిస్క్ చేసి ఆంటోనీతో కలిసి బిజినెస్ మొదలు పెడతాడు భాస్కర్. అక్కడ కోట్లు సంపాదిస్తాడు. బ్యాంకులో డబ్బుతో ఇల్లీగల్ పనులు చేస్తూనే తెలివిగా తప్పించుకుంటాడు. ఇలా సాగుతున్నపుడు సీబీఐ అధికారుల కన్ను భాస్కర్ మీద పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. సాధారణ బ్యాంక్ ఎంప్లాయ్ ఖాతాలోకి వందల కోట్లు ఎలా వచ్చాయి అనేది అసలు కథ..

అరె.. సినిమా అదిరిపోయిందిరా.. భలే తీసార్రా..! ఓ సినిమా లవర్‌గా ఈ మాట రాయడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. కానీ ఈ మాట చెప్పే ఛాన్స్ ఈ మధ్య కాలంలో చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఇచ్చాయి. ఇప్పుడు లక్కీ భాస్కర్ రూపంలో మరో అవకాశం వచ్చింది ఈ లైన్‌ చెప్పడానికి! సినిమా అదిరిపోయింది.. నిజంగా అదిరిపోయింది. వెంకీ అట్లూరి డైరెక్షన్ కంటే కూడా రైటింగ్‌కు ఫిదా అయిపోతారంతా…! ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా.. కట్టి పడేసే స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. బలమున్నోన్ని కొట్టొచ్చు కానీ తెలివైనోన్ని కొట్టలేం అనేది లక్కీ భాస్కర్ లైన్. బ్యాంకింగ్ రంగంలో జరిగే స్కామ్స్‌ను తెలివిగా వాడుకుని.. ఓ సామాన్యుడు అసామాన్యుడుగా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా కథ. ఒక్కో సీన్‌ను వెంకీ అట్లూరి డిజైన్ చేసిన తీరు అద్భుతంగా వర్కవుట్ అయింది.

లక్కీ భాస్కర్ సినిమాలో.. మొదటి అరగంట కామన్ మ్యాన్ కష్టాలు బాగా ఎస్టాబ్లిష్ చేసాడు డైరెక్టర్ వెంకీ. ఇక హీరో డబ్బు సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత.. అదేదో మనకే డబ్బు వస్తున్నట్లు కథలో లీనమైపోతాం. హీరో కంగారు పడితే మనం కంగారు పడతాం.. హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటాం.. హీరో ఎక్కడ దొరికిపోతాడో అని మనం కూడా టెన్షన్ పడుతుంటాం.. అయితే అన్ని సినిమాలకు ఇలాంటి మ్యాజిక్ అయితే జరగదు. కానీ లక్కీ భాస్కర్ విషయంలో మాత్రం అన్నీ అలా కలిసొచ్చాయంతే.! ఓ వైపు ఫ్యామిలీ ఎమోషన్స్ పర్ఫెక్టుగా ఎస్టాబ్లిష్ చేస్తూనే.. మరోవైపు హీరో వైపు ఎలివేషన్స్ కూడా ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు వెంకీ. ముఖ్యంగా సెకండాఫ్ అయితే ఇంకా వేగంగా వెళ్లిపోయింది.

దుల్కర్ సల్మాన్ మరోసారి అదరగొట్టాడు.. తన యాక్టింగ్‌తో అందర్నీ మరిపించేస్తాడు. ఇక మీనాక్షి చౌదరి కూడా చాలా బాగా నటించింది. మిగిలిన వాళ్ళలో సాయి కుమార్ నటన బాగుంది. బ్యాంక్ ఎంప్లాయ్స్‌గా శివన్నారాయణ, సచిన్ ఖేడ్‌కర్, టినూ ఆనంద్ బాగున్నారు. మరో ముఖ్యమైన పాత్రలో రాంకీ అద్భుతంగా నటించాడు. హైపర్ ఆది, కసిరెడ్డి తమ తమ పాత్రలకు న్యాయం చేసారు. వీరికి తోడు.. జివి ప్రకాశ్ కుమార్ తన మ్యూజిక్‌తో మరోసారి సినిమాకు ప్రాణంగా పోసాశాడు. బ్యాగ్ గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్ గా ఇచ్చాడు. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి నెక్ట్స్ లెవల్ అంతే. స్కామ్ 1992 ఛాయలు కనపించినా.. తన రైటింగ్‌తో స్క్రీన్ మీద పెద్ద మ్యాజిక్ చేసాడు ఈ యంగ్ డైరెక్టర్‌. ఇక ఓవర్ ఆల్‌గా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం.. లక్కీ భాస్కర్.. ఓ వెల్‌ క్రాఫ్‌టెడ్‌.. బ్యూటిఫుల్ ఫిల్మ్.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!