Ghani: గని రిలీజ్ డేట్ వచ్చేసింది.. వరుణ్ తేజ్ సినిమా విడుదల ఎప్పుడంటే..

|

Dec 25, 2021 | 11:40 AM

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గని. ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో

Ghani: గని రిలీజ్ డేట్ వచ్చేసింది.. వరుణ్ తేజ్ సినిమా విడుదల ఎప్పుడంటే..
Ghani
Follow us on

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గని. ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సిద్దు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన ఫస్ట్‌లుక్‌తో పాటు సినిమాలోని పాత్రలను పరియం చేస్తూ విడుదల చేస్తోన్న పోస్టర్‌లు ‘గని’పై ఆసక్తిని కలిగించాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గని సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. ఈ సినిమాను మార్చి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా కాసేపటి క్రితం ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో వరుణ్‌కు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ సాయి ముంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. న‌వీన్ చంద్ర, జ‌గ‌ప‌తిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. న‌దియా మ‌రో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం వరుణ్‌ తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశారు. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేయాలనుకున్నారు. కానీ అనుహ్యంగా ఈనెల 24వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత ఇప్పుడు మార్చి 18న రిలీజ్ చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు మేకర్స్.

ట్వీట్..

Also Read: RRR Song: ఆ పాటను కాపీ చేశారా ? ఆర్ఆర్ఆర్ కొమురం భీముడో సాంగ్ పై నెటిజన్స్ అసహనం..

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సరికొత్త రికార్డ్‌.. 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన ట్రైలర్‌గా గుర్తింపు

Bangarraju Movie: షూటింగ్ పూర్తి చేసిన బంగార్రాజు.. త్వరలోనే ప్రమోషన్స్ పై దృష్టి పెట్టనున్న టీమ్..