Varun Sandesh: విడుదలకు సిద్దమైన వరుణ్ సందేశ్ ‘ఇందువదన’.. కుర్ర హీరో ఆశలన్నీ ఈ సినిమా పైనే

|

Dec 10, 2021 | 8:49 PM

శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై ఎం శ్రీనివాసరాజు దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు

Varun Sandesh: విడుదలకు సిద్దమైన వరుణ్ సందేశ్ ఇందువదన.. కుర్ర హీరో ఆశలన్నీ ఈ సినిమా పైనే
Induvadana
Follow us on

Varun Sandesh: శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై ఎం శ్రీనివాసరాజు దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నాడు వరుణ్ సందేశ్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, టీజర్, పాటలకు అనూహ్యమైన స్పందన వస్తుంది. కంటెంట్ అంతా కళాత్మకంగా ఉంది. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు ఎమ్మెస్సార్. విడుదలైన క్షణం నుంచే కంటెంట్‌కు మంచి స్పందన వస్తుంది.

ఈ సినిమా టీజర్‌ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైంది. ఈ టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. వరుణ్ సందేశ్ కూడా ఇందువదన సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఇందువదన. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు. ఈ సినిమా పైన వరుణ్ సందేశ్ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ అయితే తిరిగి రాణించాలని చూస్తున్నాడు.  మరి ఈ సినిమాతో వరుణ్ సందేశ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: ఉర్రుతలూగిస్తున్న ‘పుష్ప’ మాస్ మసాలా సాంగ్.. అందంతో అదరగొట్టిన సామ్

Shyam Singha Roy : నాని ‘శ్యామ్ సింగ రాయ్’ రాయల్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే

‘Spider-Man’ No Way Home : స్పైడర్ మాన్ దెబ్బకు అట్టుడికిన వెబ్ సైట్లు.. అసలేం జరిగిందంటే..