
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లుగా రాణిస్తోన్న భార్యాభర్తలు చాలా మందే ఉన్నారు. నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల, వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి, కత్రినా కైఫ్- విక్కీ కౌశల్, రణ్ వీర్ సింగ్- దీపికా పదుకొణె, సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ.. ఇలా చాలా మంది భార్యా భర్తలు సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తున్నారు. అయితే భార్యాభర్తలు ఒకే సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించడం అరుదనే చెప్పాలి. అలా టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ కపుల్ ఇప్పుడు ఒక సినిమాలో జోడీగా నటిస్తున్నారు. అయితే వీరు సుమారు 11 ఏళ్ల క్రితమే ఓ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఆ సినిమా షూటింగులోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లిపీటలెక్కారు. తమ అన్యోన్య దాంపత్యంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తోన్న ఆ జంట ఇప్పుడు మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై మెరవనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఆ స్టార్ కపుల్ లిప్ కిస్ తో సర్ ప్రైజ్ ఇచ్చారు. మరి వారెవరో గుర్తు పట్టారా?
టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ సందేశ్- వితికా షేరుల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ సెలబ్రిటీ జంట 11 ఏళ్ళ తర్వాత హీరో హీరోయిన్స్ గా కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. డియర్ ఆస్ట్రోనాట్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో వితిక ఆస్ట్రోనాట్ డ్రెస్ లో ఉండగా వరుణ్ ఆమెకు లిప్ కిస్ పెడుతూ కనిపించాడు. బ్యాక్ గ్రౌండ్ లో రాకెట్ కూడా ఉంది. కాగా పెళ్లి తర్వాత వితిక షేరు సినిమాలు చేయకపోయినా యూట్యూబ్, టీవీ షోలతో బిజీగానే ఉంటోంది. ఇక వరుణ్ సందేశ్ కూడా ఇప్పుడు వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు.
డియర్ ఆస్ట్రోనాట్ సినిమా విషయానికి వస్తే.. రాకెట్స్, అంతరిక్షం వంటి అంశాలతో ఓ లవ్ స్టోరీగా తెరకెక్కనుందని తెలుస్తోంది. మరి చాలా కాలం తర్వాత ఈ భార్యాభర్తలు హీరోహీరోయిన్స్ గా ఎలా మెప్పిస్తారో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.