Salaar: నక్క తోక తొక్కావ్ బ్రో నువ్వు.. సలార్‌లో ప్రభాస్ బైక్ గెలుచుకుంది ఇతనే

ఇటీవలే సలార్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు డార్లింగ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో హిట్ అందుకున్నారు. దాంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ప్రభాస్ నుంచి ఎలాంటి సినిమాను ఫ్యాన్స్ ఆశిస్తున్నారో అలాంటి సినిమాను ప్రేక్షకులకు అందించాడు ప్రశాంత్ నీల్.

Salaar: నక్క తోక తొక్కావ్ బ్రో నువ్వు.. సలార్‌లో ప్రభాస్ బైక్ గెలుచుకుంది ఇతనే
Prabhas

Updated on: May 03, 2024 | 3:26 PM

ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి, ఆయన సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో టాప్ హీరోగా దూసుకుపోతున్నారు ప్రభాస్. ఇటీవలే సలార్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు డార్లింగ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో హిట్ అందుకున్నారు. దాంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ప్రభాస్ నుంచి ఎలాంటి సినిమాను ఫ్యాన్స్ ఆశిస్తున్నారో అలాంటి సినిమాను ప్రేక్షకులకు అందించాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో ప్రభాస్ కటౌట్ కు ఫ్యాన్స్ మరోసారి ఫిదా అయ్యారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ , ఎలివేషన్స్ సినిమాకే హైలైట్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ వాడిన బైక్ ను గెలుచుకోండి ఆంటూ మేకర్స్ అభిమానులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే.

సలార్ సినిమాలో ప్రభాస్ వాడిన బైక్ ను గెలుచుకునేందుకు.. మేకర్స్ ఓ కాంటెస్ట్ నిర్వహించారు. ఇందుకోసం సలార్ బైక్ ఎస్ఎంఎస్ కాంటెస్ట్ ను నిర్వహించింది. ఈ కాంటెస్ట్ లో చాలా మంది ప్రభాస్ అభిమానులు పాల్గొన్నారు. కాగా ఈ బైక్ ను ఇప్పుడు ఓ ప్రభాస్ అభిమాని సొంతం చేసుకున్నాడు. విజయవాడకు చెందిన వరప్రసాద్ ను ఆ బైక్ వరించింది.

ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సలార్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 700కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూసిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించింది ఈ సినిమా. ఇక ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. కల్కీ, ది రాజా సాబ్, సలార్ 2, స్పిరిట్ సినిమాలను లైనప్ చేశారు డార్లింగ్. ఈ సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.