పవన్‌ బర్త్‌డే: సర్‌ప్రైజ్ వ‌చ్చేసింది

|

Sep 02, 2020 | 9:48 AM

ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్‌ డే. అంటే ఆయ‌న అభిమానులకు పండుగ రోజు. ఈ సంద‌ర్భంగా వారి కోసం ఓ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది.

పవన్‌ బర్త్‌డే: సర్‌ప్రైజ్ వ‌చ్చేసింది
Follow us on

ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్‌ డే. అంటే ఆయ‌న అభిమానులకు పండుగ రోజు. ఈ సంద‌ర్భంగా వారి కోసం ఓ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ప‌వ‌న్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్ష‌న్లో ‘వకీల్‌సాబ్‌’ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. బుధ‌వారం ప‌వ‌న్ బ‌ర్త్ డే కానుక‌గా ఈ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇప్ప‌టికే విడుదలైన ఫ‌స్ట్ లుక్ అద‌ర‌గొట్ట‌గా, తాజాగా మోష‌న్ పోస్ట‌ర్ ఫ్యాన్స్‌ను అల‌రిస్తోంది. స‌‌త్య‌మేవ జ‌య‌తే అనే బ్యాక్‌గ్రౌండ్‌తో ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉన్న మోష‌న్ పోస్ట‌ర్‌లో ఒక చేతిలో ముళ్ల క‌ర్ర‌, మ‌రో చేతిలో క్రిమిన‌ల్ లా బుక్‌తో లాయ‌ర్ గెట‌ప్‌లో క‌నిపిస్తున్నారు ప‌న‌న్‌. శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల కీల‌క పాత్ర‌ధారులు.

శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ పతాకంపై ప్ర‌ముఖ నిర్మాత‌ దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్‌’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మొద‌ట‌ అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం స‌మ్మ‌ర్‌లో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నా, కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్ వాయిదాపడింది.

Also Read :

అభిమానుల మ‌ర‌ణంపై స్పందించిన ప‌వ‌న్ కళ్యాణ్

కళింగపట్నంలో ఆక‌ట్టుకుంటున్న‌ పవన్ సైకత శిల్పం