Uppena Movie : సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఉప్పెన’.. 2గంటల పాటు అలరించనున్న అందమైన ప్రేమకావ్యం..

మెగామేనల్లుడు వైష్ణ‌వ్ తేజ్ న‌టిస్తున్న చిత్రం ఉప్పెన‌. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి..

Uppena Movie : సెన్సార్ పూర్తి చేసుకున్న ఉప్పెన.. 2గంటల పాటు అలరించనున్న అందమైన ప్రేమకావ్యం..

Updated on: Feb 11, 2021 | 12:45 AM

Uppena Movie : మెగామేనల్లుడు వైష్ణ‌వ్ తేజ్ న‌టిస్తున్న చిత్రం ఉప్పెన‌. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ రచన సహకారం అందించిన ఈ చిత్రం వేసవిలోనే కావాల్సి ఉంది కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ‘ఉప్పెన’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.

అందమైన ఈ ప్రేమ కావ్యానికి ‘యూ/ఏ’ సెన్సార్ సర్టిఫికేట్ దక్కినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా నిడివి ‘ఉప్పెన’ చిత్రానికి 2 గంటల 27 నిమిషాలు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ – సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఉప్పెన సినిమా పై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేసిన దర్శకులందరు సినిమాపై ప్రశంశల వర్షం కురిపించారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sunny Leone: సన్నీలియోన్‌కి భారీ ఊరట.. ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన కేరళ హైకోర్టు