Urvashi Rautela: రామ్ పోతినేని సినిమా స్పెషల్ సాంగ్.. ఈ హాట్ బ్యూటీ ఎంత ఛార్జ్ చేస్తుందంటే..?

|

May 24, 2023 | 8:21 AM

అందాల ఆరబోతలో ఏమాత్రం మొహమాట పడకుండా ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఊర్వశి రౌతేలా భారత్ తరఫున 2015లో మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఊర్వశి రౌతేలా ఇటీవల క్రికెటర్ రిషబ్ పంత్‌తో వివాదంతో వార్తల్లో ప్రముఖంగా నిలిచింది.

Urvashi Rautela: రామ్ పోతినేని సినిమా స్పెషల్ సాంగ్.. ఈ హాట్ బ్యూటీ ఎంత ఛార్జ్ చేస్తుందంటే..?
Urvashi
Follow us on

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథానాయికలలో ఊర్వశి రౌతేల ఒకరు. హీరోయిన్‏గానే కాకుండా స్పెషల్ సాంగ్స్‏తో క్రేజ్ సంపాదించుకుంది.  బ్యూటీకి ఫ్యాన్  ఫాలోయింగ్ కూడా ఫుల్ గానే ఉంది. అందాల ఆరబోతలో ఏమాత్రం మొహమాట పడకుండా ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఊర్వశి రౌతేలా భారత్ తరఫున 2015లో మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఊర్వశి రౌతేలా ఇటీవల క్రికెటర్ రిషబ్ పంత్‌తో వివాదంతో వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. ఈ వివాదాన్ని పక్కన పెడితే ఊర్వశి తన అందంతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇక క తెలుగులోనూ ఈ అమ్మడు సాంగ్స్ చేసింది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కనిపించి మెప్పించింది ఈ వయ్యారి.

రీసెంట్ గా అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ మూవీలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. అలాగే రామ్ పోతినేని నటిస్తోన్న సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గ శ్రీలీల నటిస్తోన్న విషయం తెలిసిందే..

ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఊర్వశి భారీగా రెమ్యునరేషన్ అందుకుంటుందని తెలుస్తోంది. స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశికి దాదాపు 2 నుంచి 3 కోట్లవరకు ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫోటోలకు వీడియోలకు యమా క్రేజ్ ఉంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల మనసు దోచుకుంటుంది. ఈ అమ్మడు వయ్యారాలు ఫిదా కానీ కుర్రాడు ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు.