Uppena: చెర్రీ రికార్డును బ్రేక్‌ చేసిన ‘ఉప్పెన’ వైష్ణవ్‌ తేజ్‌.. ఇంతకీ ఈ యంగ్‌ హీరో సాధించిన ఆ ఘనత ఏంటంటే..

|

Feb 18, 2021 | 12:06 PM

Uppena Fame Vaishnav Tej New Record: 'ఉప్పెన' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌. తొలిసినిమానే అయినా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడీ యంగ్‌ హీరో. ఇక...

Uppena: చెర్రీ రికార్డును బ్రేక్‌ చేసిన ఉప్పెన వైష్ణవ్‌ తేజ్‌.. ఇంతకీ ఈ యంగ్‌ హీరో సాధించిన ఆ ఘనత ఏంటంటే..
Follow us on

Uppena Fame Vaishnav Tej New Record: ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌. తొలిసినిమానే అయినా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడీ యంగ్‌ హీరో. ఇక ప్రస్తుతం ‘ఉప్పెన’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తోంది.
కాసుల వర్షం కురిపిస్తోన్న ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే ఏకంగా రూ.43 కోట్ల నెట్‌ వసూలు చేసి బ్లాక్‌ బస్టర్‌ దిశగా దూసుకెళుతోంది. ఇక ఈ సినిమాతో హీరో వైష్ణవ్‌ తేజ్‌ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. తొలిసినిమాతోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన హీరోల జాబితాలో వైష్ణవ్‌ మొదటి స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో డెబ్యూ హీరో అత్యధిక వసూళ్లు రాబట్టిన రికార్డు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్ పేరున ఉంది. ‘చిరుత’ సినిమాతో చెర్రీ ఈ ఘనత సాధించాడు. అయితే ప్రస్తుతం వైష్ణవ్‌ ఈ రికార్డును తిరగరాశాడు. ఇక వైష్ణవ్‌ రికార్డు కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాలేదు. బాలీవుడ్‌లోనూ హృతిక్‌ రోషన్‌ పేరిట ఉన్న డెబ్యూ రికార్డును కూడా బ్రేక్‌ చేశాడీ యంగ్‌ హీరో. మరి వైష్ణవ్‌ తర్వాతి చిత్రాలకు మార్కెట్‌ ఎంతలా పెరుగుతుందో చూడాలి. ఇదిలా ఉంటే వైష్ణవ్‌ తేజ్ రెండో చిత్రం క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

Also Read: Ramanaidu Death Anniversary: మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు ఆరవ వర్ధంతి నేడు