‘ఆ స్టార్ హీరోకు బిర్యానీ అంటే పిచ్చి.. బ్రదర్ అని ఒక్కసారిగా డైరెక్టర్ అని పిలిచారు..’

ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సన, విజయ్ సేతుపతిని ఒప్పించడానికి ఆరు నెలలు పట్టిందని తెలిపారు. నేరేషన్ సమయంలో తమిళం రాకపోవడంతో ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీపై లుక్కేయండి మరి. ఇది మీకోసమే. చూసేయండి

ఆ స్టార్ హీరోకు బిర్యానీ అంటే పిచ్చి.. బ్రదర్ అని ఒక్కసారిగా డైరెక్టర్ అని పిలిచారు..
Buchi Babu

Updated on: Jan 23, 2026 | 1:40 PM

ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు.. తమ సినిమా కోసం విజయ్ సేతుపతిని ఒప్పించడానికి సుమారు ఆరు నెలలు పట్టిందని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దర్శకుడు సుకుమార్ సిఫార్సు ఉన్నప్పటికీ, విజయ్ సేతుపతి వరుస షూటింగ్‌లలో బిజీగా ఉండటం వల్ల ఆయన సమయం దొరకడం కష్టమైందని బుచ్చిబాబు వివరించారు. చివరికి, విజయ్ సేతుపతి హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌కు సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ నిమిత్తం వచ్చినప్పుడు, బుచ్చిబాబుకు ఆయనను కలిసే అవకాశం లభించింది.

ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’

విజయ్ సేతుపతికి కథను వివరించడానికి వెళ్లినప్పుడు బుచ్చిబాబు తనతో పాటు ఓ తమిళం తెలిసిన వ్యక్తిని తీసుకెళ్లారు. నేరషన్ మొత్తం అతనికి వారం రోజుల పాటు ప్రాక్టీస్ చేయించారు. చిరంజీవి వెళ్ళేటప్పుడు కూడా ఇదే పద్ధతిని అనుసరించారు. విజయ్ సేతుపతిని కలిసినప్పుడు, సదరు వ్యక్తి కథను వివరిస్తాడని బుచ్చిబాబు చెప్పగా, విజయ్ సేతుపతి స్వయంగా బుచ్చిబాబునే కథ చెప్పమని కోరారు. అనూహ్యమైన బుచ్చిబాబు కొద్దిగా టెన్షన్ పడినప్పటికీ, చివరకు నారేషన్ ఇవ్వడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

కథ చెప్పడం ప్రారంభించినప్పుడు, విజయ్ సేతుపతి ఒక షరతు విధించారు. ఏ స్క్రిప్ట్ విన్న తర్వాతైనా, నిర్ణయం తీసుకోవడానికి తనకు రెండు రోజుల సమయం పడుతుందని, ఆ తర్వాతే చేస్తానా లేదా అనేది చెప్తానని అన్నారు. నేరేషన్ మధ్యలో, విజయ్ సేతుపతికి ఆకలి వేయడంతో, బిర్యానీ ఆర్డర్ చేయమని కోరారు. బిర్యానీ వచ్చిన తర్వాత కూడా, నేరేషన్ కొనసాగించమని అడిగారు. నాలుగో, ఐదో సీన్ చెబుతున్నప్పుడు, విజయ్ సేతుపతి బుచ్చిబాబును ‘బ్రదర్’ అని పిలిచి, ఆ తర్వాత ‘డైరెక్టర్’ అని అనగా బుచ్చిబాబుకు ఆశను కలిగింది. నేరేషన్ మొత్తం పూర్తయిన తర్వాత, విజయ్ సేతుపతి తెలుగు అర్థం చేసుకోగలరని, ఆయనకు కథ కనెక్ట్ అయిందని బుచ్చిబాబుకు అర్థమైంది.

అంతకుముందు రెండు రోజుల సమయం కావాలని చెప్పిన విజయ్ సేతుపతి, నేరేషన్ పూర్తయిన వెంటనే ఒక నిమిషం మౌనంగా ఉండి, ఆ తర్వాత తమిళంలో ఏదో అన్నారు. పక్కనే ఉన్న వ్యక్తి క్లాప్స్ కొడుతూ, విజయ్ సేతుపతి సినిమా చేయడానికి అంగీకరించారని చెప్పడంతో బుచ్చిబాబు ఆశ్చర్యపోయారు. రెండు రోజుల గడువు అడిగిన విజయ్ సేతుపతి, నిమిషన్నర వ్యవధిలోనే సినిమా చేయడానికి అంగీకరించడం ఉప్పెన చిత్ర బృందానికి గొప్ప సంతోషాన్ని ఇచ్చిందని ఈ సంఘటన గుర్తు చేసుకున్నారు బుచ్చిబాబు

ఇది చదవండి: షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏమన్నారంటే.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..