ఆ దర్శకుడు నైట్‌కు రమ్మని ఇబ్బంది పెట్టాడు.. షాకింగ్ విషయం చెప్పిన స్టార్ నటి

|

May 02, 2024 | 3:11 PM

కెరీర్ స్టార్టింగ్ లో చాలా మంది లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా తాను లైంగిక వేధింపుల గురించి మాట్లాడింది. ఓ దర్శకుడు తనను నైట్ కు రమ్మన్నాడు అని తెలిపింది. ఇంతకు ఆమె ఎవరు.? ఆమెను వేధించిన దర్శకుడు ఎవరు.? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.!

ఆ దర్శకుడు నైట్‌కు రమ్మని ఇబ్బంది పెట్టాడు.. షాకింగ్ విషయం చెప్పిన స్టార్ నటి
Actress
Follow us on

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి నిత్యం రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. చాలా మంది హీరోయిన్స్ తాము లైంగిక వేధింపులకు గురయ్యాం అని మీడియా ముందు దైర్యంగా మాట్లాడారు. దీనిపై చాలా మంది హీరోయిన్స్ తమ గొంతు విప్పారు. అలాగే కెరీర్ స్టార్టింగ్ లో చాలా మంది లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా తాను లైంగిక వేధింపుల గురించి మాట్లాడింది. ఓ దర్శకుడు తనను నైట్ కు రమ్మన్నాడు అని తెలిపింది. ఇంతకు ఆమె ఎవరు.? ఆమెను వేధించిన దర్శకుడు ఎవరు.? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.!

ఓ నటి తనకు ఎదురైన చేదు అనుభవం గురించి మాట్లాడింది. ఓ దర్శకుడు తనను ఇబ్బంది పెట్టాడని తెలిపింది. ఆమె ఓ స్టార్ నటి. ఎన్నో వందల సినిమాల్లో నటించింది. కెరీర్ స్టార్టింగ్ లో ఓ దర్శకుడు తనను నైట్ కు రమ్మన్నాడు అని తెలిపింది. ఆమె ఎవరో కాదు.. ఉపాసన సింగ్. ఈ చిన్నది బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే.. హిందీ సినిమాలు చూసే ప్రతిఒక్కరికి ఉపాసన సింగ్ తెలుసు.

బాయి చలీ ససురాయి అనే రాజస్థాని సినిమాతో పరిచయం అయ్యింది. కెరీర్ స్టార్టింగ్ లో హీరోయిన్ గా సినిమాలు చేసింది. హీరోయిన్ గా సక్సెస్ ఆవ్వలేకపోయింది. ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తుంది. ఈ చిన్నది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల కొద్దీ సినిమాల్లో నటించింది. జుదాయి సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తాజాగో ఇంటర్వ్యూలో ఉపాసన సింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ లో ఎదురైన చేదు అనుభవం గురించి మాట్లాడింది. అనిల్ కపూర్ సరసన ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఓ దర్శకుడు తనను ఇబ్బంది పెట్టారని తెలిపింది. కారు పంపిస్తాను నైట్ హోటల్ కు రమ్మన్నాడని తెలిపింది. అప్పుడు తన వయసు 17 ఏళ్లు ఆ సమయంలో నాకు ఏం అర్ధం కాలేదు అని తెలిపింది. నేను రేపు వస్తాను అని చెప్పినా కూడా అతను నన్ను వదలకుండా.. కారు పంపిస్తా.. వచ్చేయ్ అన్నాడు. దాంతో నాకు విషయం అర్ధమై అతన్ని మందలించాను అని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.