
మెగా పవర్ స్టా్ర్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మూవీపై భారీ అంచనాలు పెంచేసింది. ఇదిలా ఉంటే.. ఇటీవల లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించార. ఇటీవల జరిగిన ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రామ్ చరణ్ తోపాటు భార్య ఉపాసన, కుమార్తె క్లీంకార, మెగాస్టార్ చిరంజీవి, సురేఖ సైతం పాల్గొన్నారు. చరణ్ మైనపు విగ్రహంతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇందుకు సంబంధిత విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.
తాజాగా క్లీంకారకు సంబంధించిన ఓ క్యూట్ వీడియో ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తన విగ్రహం పక్కన కూర్చొని రామ్ చరణ్ ఫోటోలకు ఫోజులు ఇస్తుండగా.. క్లీంకార నెమ్మదిగా చరణ్ మైనపు విగ్రహం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నం చేసింది. అప్పుడే చరణ్ తన కుమార్తెను ఆపగా.. చరణ్ మైనపు విగ్రహం వైపు చూపిస్తుంది. ఈ వీడియోలో క్లీంకార ముఖం కనిపించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఈ క్యూట్ వీడియో నెట్టింట తెగ వైరలవుతుండగా.. ఒకేచోట ఇద్దరు రామ్ చరణ్ లు కనిపించడంతో క్లింకార కన్ఫ్యూజ్ అయ్యిందంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
చరణ్ మైనపు విగ్రహంతో కలిసి మెగాస్టార్ చిరంజీవి, ఉపాసన, సురేఖ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే మైనపు విగ్రహంలో ఆయనతోపాటు తన పెంపుడు కుక్క రైమ్ కూడా ఉండడం విశేషం. అలా పెంపుడు జంతువుతో కలిసి ఉన్న మైనపు విగ్రహం కలిగిన రెండో సెలబ్రెటీగా రామ్ చరణ్ రికార్డ్ సృష్టించాడు. పెంపుడు జంతువుతో కలిసి మైనపు విగ్రహం కలిగిన మొదటి వ్యక్తి రాణి ఎలిజబెత్ 2.
ఇవి కూడా చదవండి :
Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?
Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‌తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..