Upasana Konidela: ఆ విషయంలో రామ్ చరణ్ పై జలసీగా ఉందన్న ఉపాసన.. క్లీంకార గురించి ఏం చెప్పిందంటే..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన రామ్ చరణ్, తన క్లీంకార పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల తన తాతయ్య ప్రతాప్ రెడ్డి 91వ పుట్టినరోజు సందర్బంగా స్పెషల్ బుక్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గలాటాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ.. చరణ్.. తన కూతురు క్లీంకార మధ్య ఉన్న బాండింగ్ గురించి చెప్పుకొచ్చింది. సాధారణంగా ఆడపిల్లలు ఎక్కువగా తండ్రికి దగ్గరగా ఉంటారు.. మరీ మీ స్వీట్ లిటిల్ గర్ల్ గురించి ఏమిటి ?

Upasana Konidela: ఆ విషయంలో రామ్ చరణ్ పై జలసీగా ఉందన్న ఉపాసన.. క్లీంకార గురించి ఏం చెప్పిందంటే..
Upasana, Ram Charan

Updated on: Feb 07, 2024 | 6:46 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారో తెలిసిందే. ఎప్పుడూ ఫ్యామిలీ విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ముఖ్యంగా చరణ్, చిరంజీవి, క్లీంకార గురించి ఎప్పటికప్పుడు నెట్టింట పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన రామ్ చరణ్, తన క్లీంకార పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల తన తాతయ్య ప్రతాప్ రెడ్డి 91వ పుట్టినరోజు సందర్బంగా స్పెషల్ బుక్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గలాటాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ.. చరణ్.. తన కూతురు క్లీంకార మధ్య ఉన్న బాండింగ్ గురించి చెప్పుకొచ్చింది. సాధారణంగా ఆడపిల్లలు ఎక్కువగా తండ్రికి దగ్గరగా ఉంటారు.. మరీ మీ స్వీట్ లిటిల్ గర్ల్ గురించి ఏమిటి ? అని యాంకర్ అడగ్గా.. ఉపాసన రియాక్ట్ అవుతూ.. వారిద్ది మధ్య బాండింగ్ చూసి తనకు జలసీగా ఉంటుందని తెలిపారు.

తన కూతురు క్లీంకార తన తండ్రి చెర్రీని చూడగానే ముఖం ఎంతో వెలిగిపోతుందని.. చరణ్‏ను చూడగానే నువ్వుతుందని.. తన కళ్లలో మెరుపు వస్తుందని.. వారిద్దరి ఆ బాండింగ్ చూస్తే తనకు జలసీగా ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో ఉపాసన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఉపాసన కామెంట్స్ పై ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. చరణ్ షూటింగ్స్ కు వెళ్లకపోవడానికి ఇదే కారణమన్నమాట.. క్లీంకార డాడీ లిటిల్ ప్రిన్స్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఉపాసన ఇంటర్వ్యూ వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

రామ్ చరణ్, ఉపాసన తమ వివాహం జరిగిన 11 సంవత్సరాల తర్వాత మొదటి పాపకు జన్మనిచ్చారు. గతేడాది జూన్ 20న క్లీంకార జన్మించింది. పాప పుట్టిన తర్వాత చరణ్, ఉపాసన దంపతులు .. తిరిగి చిరు నివాసానికి షిప్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో చరణ్ వర్క్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.