Chiranjeevi: ‘నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే అన్నయ్య అభిమానిని’: కేంద్ర మంత్రి బండి సంజయ్

|

Jun 24, 2024 | 5:28 PM

చిరంజీవితో సమావేశమైన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు బండి సంజయ్.. 'అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఎప్పుడూ ఆనందదాయకమే. చిరంజీవి వినయశీలి, నా శ్రేయోభిలాషి. నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఆయన సినిమాలకు అభిమానిని' ట్వీట్ చేశారు బండి సంజయ్.

Chiranjeevi: నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే అన్నయ్య అభిమానిని: కేంద్ర మంత్రి బండి సంజయ్
Chiranjeevi, Bandi Sanjay
Follow us on

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని మెగాస్టార్ నివాసానికి వెళ్లిన సంజయ్‌ చాలా సేపు ఆయనతో ముచ్చటించారు. పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా చిరంజీవి కేంద్ర మంత్రికి సాదర స్వాగతం పలికారు. శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. చిరంజీవితో సమావేశమైన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు బండి సంజయ్.. ‘అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఎప్పుడూ ఆనందదాయకమే. చిరంజీవి వినయశీలి, నా శ్రేయోభిలాషి. నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఆయన సినిమాలకు అభిమానిని’ ట్వీట్ చేశారు బండి సంజయ్. ప్రస్తుతం వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. సినిమా రంగానికి  మెగాస్టార్ చిరంజీవి అందించిన సేవలకు గుర్తింపుగగా ఇటీవలే  కేంద్ర ప్రభుత్వం  ఆయనను పద్మ విభూషణ్ తో గౌరవించింది. ఈ సందర్భంగానే కేంద్ర మంత్రి మెగాస్టార్ ను కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కాగా ఇటీవల సార్వత్రిక ఎన్నికలకు ముందు చిరంజీవి పవన్ జనసేనతో పాటు కొందరు బీజేపీ నేతలను గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉంటున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో త్రిషతో మరో ఇద్దరు హీరోయిన్లు స్పెషల్ రోల్స్ లో కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది.  ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా  జనవరి 10న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

 

మెగాస్టార్ చిరంజీవితో బండి సంజయ్..

విశ్వంభర సెట్ లో మెగాస్టార్ చిరంజీవితో మంత్రి కందుల దుర్గేష్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.