Actress Anita: తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్న ఉదయ్ కిరణ్ హీరోయిన్.. సుహాస్ సినిమాలో ‘నువ్వు నేను’ అనిత..

ఇటీవలే ఈ మూవీ రీరిలీజ్ అయి మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ మూవీలో అందం, అభినయంతో కట్టిపడేసిన అనిత.. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. కొన్నాళ్ల తర్వాత హిందీలో సీరియల్స్ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది అనిత. ఇక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తిరిగి వస్తుంది. ఓ భామ అయ్యో రామ అనే సినిమాతో మల్లీ తెలుగు అడియన్స్ ముందుకు వస్తుంది

Actress Anita: తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్న ఉదయ్ కిరణ్ హీరోయిన్.. సుహాస్ సినిమాలో నువ్వు నేను అనిత..
Malavika, Suhas, Anita

Updated on: Mar 30, 2024 | 2:01 PM

దివంగత హీరో ఉదయ్ కిరణ్ కెరీర్‏ను మలుపు తిప్పిన సినిమాల్లో నువ్వు నేను ఒకటి. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకే హైలెట్. ఇందులో ఉదయ్ కిరణ్ జోడిగా హీరోయిన్ అనిత నటించింది. ఇటీవలే ఈ మూవీ రీరిలీజ్ అయి మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ మూవీలో అందం, అభినయంతో కట్టిపడేసిన అనిత.. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. కొన్నాళ్ల తర్వాత హిందీలో సీరియల్స్ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది అనిత. ఇక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తిరిగి వస్తుంది. ఓ భామ అయ్యో రామ అనే సినిమాతో మల్లీ తెలుగు అడియన్స్ ముందుకు వస్తుంది అనిత. ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

వరుస హిట్స్‏తో హ్యాట్రిక్ హీరోగా దూసుకుపోతున్న సుహాస్.. ఇప్పుడు మరో కొత్త సినిమాను ప్రారంభించారు. ఎప్పుడూ కొత్త కొత్త కథలతో.. తనదైన నటనతో అలరిస్తున్న సుహాస్.. ఓ భామ అయ్యో రామ సినిమాను అనౌన్స్ చేశాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన జో మూవీ హీరోయిన్ మాళవిక మనోజ్ ఇందులో కథానాయికగా నటిస్తుంది. ఇక కొత్త దర్శకుడు రామ్ గోడల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన సుహాస్.. ఇప్పుడు వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇటీవలే అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు సుహాస్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ప్రసన్న వదనన, శ్రీరంగనీతులు సినిమా షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ఈరోజు రిలీజ్ అయిన శ్రీరంగనీతులు ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఓ భామ అయ్యో రామ సినిమాను ప్రారంభించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.