కరణ్ జోహార్ ఇంట్లో ఇద్దరికి కరోనా నిర్దార‌ణ‌…

బాలీవుడ్ ఫేమ‌స్ ద‌ర్శ‌క‌నిర్మాత‌, న‌టుడు కరణ్ జోహార్ ఇంట్లో ఇద్దరికి కోవిడ్-19 సోకింది. ఆయన ఇంట్లో పనిచేసే స్టాఫ్‌లో ఇద్దరికి క‌రోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు కరణ్ జోహార్ సోమ‌వారం స్వయంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌మెంట్ రూల్స్ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన వెల్ల‌డించారు. ‘‘మా ఇంట్లో పనిచేసే ఉద్యోగుల్లో ఇద్దరికి కోవిడ్-19 టెస్టులు చేయ‌గా పాజిటివ్ అని తేలింది. వారిలో సింట‌మ్స్ కనిపించిన వెంటనే మా నివాసంలోని ఒక గదిలో […]

కరణ్ జోహార్ ఇంట్లో ఇద్దరికి కరోనా నిర్దార‌ణ‌...

బాలీవుడ్ ఫేమ‌స్ ద‌ర్శ‌క‌నిర్మాత‌, న‌టుడు కరణ్ జోహార్ ఇంట్లో ఇద్దరికి కోవిడ్-19 సోకింది. ఆయన ఇంట్లో పనిచేసే స్టాఫ్‌లో ఇద్దరికి క‌రోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు కరణ్ జోహార్ సోమ‌వారం స్వయంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌మెంట్ రూల్స్ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన వెల్ల‌డించారు.

‘‘మా ఇంట్లో పనిచేసే ఉద్యోగుల్లో ఇద్దరికి కోవిడ్-19 టెస్టులు చేయ‌గా పాజిటివ్ అని తేలింది. వారిలో సింట‌మ్స్ కనిపించిన వెంటనే మా నివాసంలోని ఒక గదిలో వారిని క్వారంటైన్‌లోకి పంపాం. బృహత్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కి వెంట‌నే ఈ విషయాన్ని తెలిపాం. నా బిల్డింగ్ మొత్తం రసాయనాలతో శుద్ది చేశారు. రూల్స్ ప్రకారం క్రిమిరహితం చేశారు. నా ఫ్యామిలీ మెంబ‌ర్స్, మిగిలిన స్టాఫ్ అంతా సేఫ్ గా ఉన్నారు. మాలో ఎలాంటి సింట‌మ్స్ లేవు. ఈరోజు ఉదయం మేమంతా కోవిడ్-19 టెస్ట్‌లు చేయించుకున్నాం. అందరికీ నెగిటివ్ అని తేలింది. అయినప్పటికీ మా చుట్టూ ఉన్న వాళ్ల సేప్టీని దృష్టిలో పెట్టుకుని మేమంతా మరో 14 రోజులపాటు హోమ్ క్వారంటైన్ లోకి వెళ్తున్నాం. అందర్నీ రక్షించాలనే మన నిబద్ధతకు మేం కట్టుబడి ఉంటాం. ప్ర‌భుత్వం సూచించిన అన్ని జాగ్రత్తలను కచ్చితంగా మేమంతా ఫాలో అవుతాం. కరోనా సోకిన‌వారిద్దరికీ మంచి ట్రీట్మెంట్ అందిస్తామని, జాగ్రత్తగా చూసుకుంటామని హామీ ఇస్తున్నాను. వారు త్వరలోనే కోలుకుంటారని చెప్తున్నాను. ఇది సంక్షోభ స‌మ‌యమే అయినప్పటికీ ఎవరింట్లో వారుంటూ సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ క‌రోనావైరస్‌ను ఎదిరించ‌డంలో ఎలాంటి అనుమానం లేదని నేను భావిస్తున్నాను’’ అని కరణ్ జోహార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.