
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే రూ 250 కోట్లకు చేరువైన ఈ సినిమా రూ. 300 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి వింటేజ్ కామెడీ, ఫైట్స్, యాక్షన్ సీన్స్ హైలెల్ గా నిలిచాయి. వీటన్నిటికంటే మెగాస్టార్ వేసిన స్టెప్పులు అభిమానులను ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా హుక్ స్టెప్ సాంగ్ లో చిరంజీవి డ్యాన్స్ కు థియేటర్లలో విజిల్స్ పడ్డాయి. ఇక సోషల్ మీడియాలోనూ హుక్ స్టెప్ ట్రెండ్ కొనసాగుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా, సామన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ హుక్ స్టెప్ సాంగ్ ను రీక్రియేట్ చేస్తున్నారు. చిరంజీవి పాటకు తమదైన స్టైల్ లో స్టెప్పులేస్తూ ఇన్ స్టాలో రీల్స్, షార్ట్స్ చేస్తున్నారు. తాజాగా ఇదే హుక్ స్టెప్ సాంగ్ కు ఇద్దరు బామ్మలు డాన్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి తరహాలో మొబైల్ లైట్ పెట్టుకొని మరీ ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన మెగాస్టార్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో మెరిశాడు. క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, శరత్ సక్సేనా తదితరులు వివిధ పాత్రల్లో కనిపించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. భీమ్స్ స్వరాలు సమకూర్చారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న ఈ మెగా మూవీ ఐదు రోజుల్లో రూ. 226 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు.
Wow..Wow..Wow 🙂↕️❤️ pic.twitter.com/jkiYYv3rsI
— Movies4u Official (@Movies4u_Officl) January 17, 2026
#HookStepMania takes over the theatres 🔥🔥🔥
Hit Machine #AnilRavipudi enjoying the electrifying audience vibe at Urvashi Theatre, Mangalagiri ❤️🔥
Meet the team of #ManaShankaraVaraPrasadGaru next at G3 Theatre and Alankar theatre, Vijayawada 💥#MegaSankranthiBlockbusterMSG pic.twitter.com/U8aTLjkN4S
— Shine Screens (@Shine_Screens) January 17, 2026
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..