చిరుతో సినిమా చేసేందుకు బ‌డా ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఆస‌క్తి !

|

Aug 24, 2020 | 4:29 PM

మెగాస్టార్​ చిరంజీవి ప్ర‌స్తుతం 'ఆచార్య' సినిమాలో నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా కార‌ణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా ప‌డింది.

చిరుతో సినిమా చేసేందుకు బ‌డా ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఆస‌క్తి !
Follow us on

మెగాస్టార్​ చిరంజీవి ప్ర‌స్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా కార‌ణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా ప‌డింది. కాగా దీని తర్వాత చేస్తున్న ప్రాజెక్టుల గురించి మెగాస్టార్ ఇటీవ‌లే హింట్ ఇచ్చారు. వాటిలో లూసిఫర్ రీమేక్​తోపాటు యంగ్ డైరెక్ట‌ర్ బాబీతోనూ కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమాని నిర్మించేందుకు టాలీవుడ్ బ‌డా ప్రొడ‌క్ష‌న్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఇంట్ర‌స్ట్ చూపిస్తోంద‌ని స‌మాచారం.

కానీ ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం చిరు, మరో బ‌డా ప్రొడ్యూస‌ర్‌తో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నార‌ట‌. వీటిల్లో నిజ‌నిజాలు తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సింది. ‘ఆచార్య’లో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. మెగాపవర్ స్టార్ రామ్​ చరణ్ ఈ చిత్రంలో ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం.

 

Also Read :

ఏపీ : ఆ 4 జిల్లాల్లో లక్షణాలు లేకపోయినా‌ కరోనా పాజిటివ్‌

వైఎస్సార్‌ ఆసరా‌ నగదుపై ఆంక్షలు లేవు, ఉత్త‌ర్వుల్లో తేల్చి చెప్పిన స‌ర్కార్