Tollywood : టాప్ 5 సినిమా వార్తలు.. బేబీని ఆకాశానికెత్తేసిన విజయ్ దేవర కొండ..

యంగ్‌ టీమ్‌ సాధించిన సక్సెస్‌కి హ్యాపీగా ఉన్నట్టు చెప్పారు విజయ్‌ దేవరకొండ. బేబీ మూవీని జులై 13న చూశానన్నారు. సినిమా చాలా బాగా నచ్చిందని చెప్పారు. ఆ విషయాన్ని చెప్పడానికి అప్పుడు మాటలు రాలేదని అన్నారు విజయ్‌.

Tollywood : టాప్ 5  సినిమా వార్తలు.. బేబీని ఆకాశానికెత్తేసిన విజయ్ దేవర కొండ..
Telugu Movies

Edited By:

Updated on: Jul 19, 2023 | 11:01 AM

మాట రాని మౌనమది

బేబీ సక్సెస్‌ మీట్‌లో చీఫ్‌ గెస్ట్ గా పాల్గొన్నారు హీరో విజయ్‌ దేవరకొండ. ఆయన సోదరుడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన సినిమా ఇది. ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. యంగ్‌ టీమ్‌ సాధించిన సక్సెస్‌కి హ్యాపీగా ఉన్నట్టు చెప్పారు విజయ్‌ దేవరకొండ. బేబీ మూవీని జులై 13న చూశానన్నారు. సినిమా చాలా బాగా నచ్చిందని చెప్పారు. ఆ విషయాన్ని చెప్పడానికి అప్పుడు మాటలు రాలేదని అన్నారు విజయ్‌.

 మిమి టు మీనా
బాలీవుడ్‌లో మీనాకుమారి గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయక్కర్లేదు. ట్రాడెజీ క్వీన్‌గా ఆమెకున్న చరిష్మా అలాంటిది. దివంగత నటి మీనాకుమారి జీవిత గాథతో ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ఓ సినిమా తీయనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. మీనాకుమారి పాత్ర కోసం కృతిసనన్‌ని సంప్రదించినట్టు వినికిడి.

సైంధవ్‌ హృదయం
సైంధవ్‌ హార్డ్ సైడ్‌ చూశారు… ఇప్పుడు హార్ట్ చూడండి అని అంటున్నారు మేకర్స్. వెంకటేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా సైంధవ్‌. ఇది ఆయనకు తొలి ప్యాన్‌ ఇండియన్‌ మూవీ. డిసెంబర్‌ 22న విడుదల కానుంది. ఈ సినిమాలో సైంధవ్‌ హార్ట్ అంటూ బేబీ సారా పోస్టర్‌ విడుదల చేశారు మేకర్స్. గాయత్రి అనే పాత్రలో కనిపిస్తుంది సారా.

 ఆయనే కారణం
బ్రో మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు కేతిక శర్మ. పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌తేజ్‌ నటిస్తున్న సినిమా బ్రో. ఈ సినిమాలో సాయితేజ్‌కి జోడీగా నటించారు కేతిక. మంచి మెసేజ్‌ ఉన్న సినిమా బ్రో అని చెప్పారు కేతిక. ఇలాంటి కేరక్టర్‌ని ఇంతకు ముందెప్పుడూ చేయలేదని అన్నారు. టైమ్‌ గురించి చెప్పిన విషయాలు ఆసక్తి రేకెత్తిస్తాయన్నారు. పవన్‌ కల్యాణ్‌ పేరు వినగానే ఇంకేం ఆలోచించకుండా ఈ సినిమాకు సంతకం చేశానని చెప్పారు కేతిక.

ఉరిమే మేఘం
తుఫానుకు ముందు ఉరిమే మేఘం ఆమె అంటూ నయనతార పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు బాద్షా షారుఖ్‌ ఖాన్‌. ఆయన హీరోగా నటించిన సినిమా జవాన్‌. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌లో పవర్‌ఫుల్‌ పోలీస్‌ రోల్‌ చేశారు నయనతార. మెషిన్‌ గన్‌ పట్టుకుని స్టైలిష్‌ లుక్‌లో ఉన్న నయన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్. అట్లీ డైరకట్‌ చేస్తున్న జవాన్‌ సెప్టెంబర్‌ 7న విడుదల కానుంది.