రజనీకాంత్ హీరోగా నటించిన సినిమా జైలర్. ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని ఆయన అభిమానులతో కలిసి మైసూర్‌లో చూశారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఆయన్ని అభిమానులు చుట్టుముట్టారు. స్క్రీన్ మీద కనిపించింది కాసేపే అయినా, ఇంపాక్ట్ ఉన్న కేరక్టర్‌లో చేసినందుకు ఆనందంగా ఉందని చెప్పారు శివరాజ్‌కుమార్.