AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prashanth Neel: కేజీఎఫ్ ద‌ర్శ‌కుడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పిన టాలీవుడ్ హీరోలు.. ప్ర‌శాంత్ త‌ర్వాతి చిత్రం..

Prashanth Neel: కేజీఎఫ్ అనే ఒక్క చిత్రంతో యావ‌త్ దేశాన్ని తన‌వైపు తిప్పుకున్నాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌. క‌న్న‌డ సినిమా ఇండ‌స్ట్రీ నుంచి వ‌చ్చిన ఒక చిత్రం ఇంత‌లా దేశం దృష్టిని ఆక‌ర్షించ‌డం బ‌హుశా ఇదే తొలిసారి కావొచ్చు. టాలీవుడ్...

Prashanth Neel: కేజీఎఫ్ ద‌ర్శ‌కుడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పిన టాలీవుడ్ హీరోలు.. ప్ర‌శాంత్ త‌ర్వాతి చిత్రం..
Prashanth Neel Birthday
Narender Vaitla
|

Updated on: Jun 04, 2021 | 12:17 PM

Share

Prashanth Neel: కేజీఎఫ్ అనే ఒక్క చిత్రంతో యావ‌త్ దేశాన్ని తన‌వైపు తిప్పుకున్నాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌. క‌న్న‌డ సినిమా ఇండ‌స్ట్రీ నుంచి వ‌చ్చిన ఒక చిత్రం ఇంత‌లా దేశం దృష్టిని ఆక‌ర్షించ‌డం బ‌హుశా ఇదే తొలిసారి కావొచ్చు. టాలీవుడ్ మొద‌లు బాలీవుడ్ వ‌ర‌కు ఈ సినిమా సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో ఈ చిత్ర ద‌ర్శ‌కుడి పేరు దేశవ్యాప్తంగా మారు మోగింది. బ‌డా హీరోలు సైతం ప్ర‌శాంత్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌నిచేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే నేడు (శుక్ర‌వారం) ప్ర‌శాంత్ నీల్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భాన్ని పురస్క‌రించుకొని సినీ ప్ర‌ముఖ‌లంతా ప్ర‌శాంత్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ యంగ్ హీరోలు ప్ర‌భాస్‌, ఎన్టీఆర్ ప్ర‌శాంత్‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌ర్త్‌డే విషెస్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు.. నీకు ఈరోజు ఎంతో సంతోషంగా గ‌డ‌వాల‌ని రాసుకొచ్చారు. ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. హ్యాపీ బ‌ర్త్‌డే బ్ర‌ద‌ర్‌. నువ్వు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండు. నీతో క‌లిసి ప‌నిచేసేందుకు ఎంతో ఆస‌క్తిగా ఉన్నాను అంటూ క్యాప్ష‌న్ జోడించారు. ఇక ప్ర‌శాంత్ త‌న తొలి తెలుగు చిత్రాన్ని ప్ర‌భాస్‌తో నిర్మిస్తోన్న విష‌యం తెలిసిందే. మాఫియా నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న స‌లార్ చిత్రంలో ప్ర‌భాస్‌ స‌ర‌స‌న శృతీహాస‌న్ న‌టిస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా నేప‌థ్యంలో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తికాగానే ప్ర‌శాంత్ త‌న త‌ర్వాతి చిత్రాన్ని జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో తెర‌కెక్కిస్తోన్న విష‌యం తెలిసిందే.

ప్ర‌భాస్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

జూనియ‌ర్ ఎన్టీఆర్ చేసిన‌ ట్వీట్‌..

Also Read: Coronavirus: మంచిర్యాల జిల్లాలో అమానుషం.. క‌రోనా వ‌చ్చింద‌ని భార్య‌ను బాత్రూంలో బంధించిన భ‌ర్త

RBI Monetary Policy 2021: కరోనా సెకెండ్ వేవ్‌లో ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో మార్పుల లేదని ప్రకటన

JIO TV: జియో టీవీని ల్యాప్‌టాప్, కంప్యూట‌ర్‌లో చూడాల‌నుకుంటున్నారా? ఇలా ట్రై చేయండి..

UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?
రూ.లక్షన్నర జీతంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు
రూ.లక్షన్నర జీతంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు
ఎర్ర అరటి తింటే అందే ప్రయోజనాలు తెలుసా..?
ఎర్ర అరటి తింటే అందే ప్రయోజనాలు తెలుసా..?