Childhood Photo: సహజనటి పక్కన ఉన్న ఈ బాలుడు.. నేడు యువతకు కలల రాకుమారుడు ఎవరో గుర్తు పట్టారా..

Childhood Photo: బాల్యం ఎవరికైనా మధురమే.. అప్పటి మధుర స్మృతులను నెమరువేసుకోవడానికి అందరూ ఆసక్తిని చూపిస్తారు. అయితే సామాన్యులకు చిన్నతనంలో ఎలా ఉన్నామని చూపించేంవి ఫోటోలు..

Childhood Photo: సహజనటి పక్కన ఉన్న ఈ బాలుడు.. నేడు యువతకు కలల రాకుమారుడు ఎవరో గుర్తు పట్టారా..
Childhood Pic

Updated on: Aug 28, 2021 | 9:32 AM

Childhood Photo: బాల్యం ఎవరికైనా మధురమే.. అప్పటి మధుర స్మృతులను నెమరువేసుకోవడానికి అందరూ ఆసక్తిని చూపిస్తారు. అయితే సామాన్యులకు చిన్నతనంలో ఎలా ఉన్నామని చూపించేంవి ఫోటోలు అయితే.. కొంతమందికి మాత్రం ఈ విషయంలో మినహాయింపు.. ముఖ్యంగా సినిమాల్లో బాలనటులుగా నటించిన వారికీ మాత్రం తమ బాల్యాన్ని వారి సినిమాలు గుర్తు చేస్తుంటాయి. ఇక అలాంటి బాలనటులు.. పెరిగి పెద్దయ్యాక సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే.. ఫ్యాన్స్ కు మరింత ఆనందం.. వారు చిన్నతనంలో నటించిన సినిమాలను చూస్తూ సంతోష పడే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. చాలామంది సినిమాల్లో బాలనటులుగా నటించి పెరిగి పెద్ద అయిన తర్వాత అదే రంగంలోకి.. అడుగు పెట్టినవారు కొందరు అయితే.. మరికొందరు విభిన్న వృత్తులను ఎంచుకుని తమదైన శైలిలో కెరీర్ లో దూసుకెళ్తున్నవారు ఇంకొందరు. అయితే సినీ పరిశ్రమలో హీరోల తనయులు హీరోలుగా అడుగు పెట్టి రాణించినవారు చాలామంది ఉన్నారు. ఈ ఫొటోలో సహజనటి జయసుధ పక్కన ఉన్న చిన్నోడు ఒక స్టార్ హీరో తనయుడు.. ఇప్పుడు ఒక స్టార్ హీరో.. అంతేకాదు టాలీవుడ్ అమ్మాయిల కలల రాకుమారుడు.. మరి ఎవరో ఆ హీరో గుర్తు పట్టారా..

సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు మహేష్ బాబు. బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించాడు. అన్న రమేష్ బాబు నటించిన నీడ సినిమాతో వెండి తెరపై తొలిసారిగా అడుగు పెట్టాడు. అనంతరం తండ్రి కృష్ణ పోరాటం సినిమాలో తండ్రికి తమ్ముడిగా నటించి అందరినీ తన నటనతో ఆకట్టుకున్నాడు. శంఖారావం, బజారు రౌడీ, ముగ్గురు కొడుకులు, గూడచారి 117 , కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్న – తమ్ముడు ల్లో బాలనటుడిగా నటించాడు.తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందాడు.

Mahesh Babu

ఇక రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. ఇప్పటి వరకూ 25 కు పైగా సినిమాల్లో హీరోగా నటించాడు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. హీరోయిన్ నమ్రత ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు గౌతమ్. సితార ఇద్దరు సంతానం. మహేష్ కుమారుడు గౌతమ్ కూడా బాలనటుడిగా నటించి అలరించాడు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల ముందుకు సరిలేరు నీకెవ్వరూ సినిమాతో రానున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

Also Read: Tokyo Paralympics: పారా ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భవినాబెన్.. ఫైనల్‌కు చేరుకున్న తొలి భారత ప్యాడ్లర్‌