Tollywood: సమస్యలకు శుభంకార్డ్‌.. రీస్టార్ట్ అవ్వనున్న షూటింగ్స్.. ఎప్పటినుంచి అంటే

|

Aug 23, 2022 | 7:19 PM

టాలీవుడ్‌కి శుభం కార్డ్‌ పడింది. సినిమా షూటింగ్‌లు లేక బోసిపోయిన ఫిల్మ్ టౌన్ ఇక యాక్టివ్‌ కానుంది. కెమెరా.. సౌండ్.. యాక్షన్ లతో.. ఆగస్టు 25నుంచి సందడి మొదలవనుంది.

Tollywood: సమస్యలకు శుభంకార్డ్‌.. రీస్టార్ట్ అవ్వనున్న షూటింగ్స్.. ఎప్పటినుంచి అంటే
Tollywood
Follow us on

Tollywood: టాలీవుడ్‌ సమస్యలకు శుభం కార్డ్‌ పడింది. సినిమా షూటింగ్‌లు లేక బోసిపోయిన ఫిల్మ్ టౌన్ ఇక యాక్టివ్‌ కానుంది. కెమెరా.. సౌండ్.. యాక్షన్ లతో.. ఆగస్టు 25నుంచి సందడి మొదలవనుంది. నిన్న మొన్నటి వరకు రకరకాల ఇష్యూలతో సతమతమవుతున్న టాలీవుడ్‌ను.. ఉన్నపళంగా ఆగేలా చేశారు తెలుగు ప్రొడ్యూసర్ గిల్డ్ సభ్యలు. సినిమా షూటింగ్‌లన్నీ ఆపేసి.. ఇండస్ట్రీని పోకడని.. సరిచేసే ప్రయత్నం చేశారు. టికెట్ రేట్లు.. థియేటర్లలో లభించే తినుభండారాల రేట్ల.. దగ్గరి నుంచి.. ప్రొడక్షన్ కాస్ట.. సెలబ్రిటీల రెమ్యూనరేషన్ వరకు.. అన్నింటిపైనా చర్చించిన ప్రొడ్యూసర్స్ రీసెంట్‌గా ఓ నిర్ణయానికి వచ్చారు. ఈక్రమంలోనే.. షూటింగ్‌లపై ఉన్న నిషేదాన్ని ఎత్తేసి.. ఇక షూటింగ్‌లు జరుపుకోవచ్చంటూ.. ఇటీవల అనౌన్స్ చేశారు.

ఇక ఇప్పుడు తాజాగా ఆగస్టు 25 నుంచి షూటింగ్‌లు మొదలవుతున్నాయని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు గిల్డ్ సభ్యులు దిల్ రాజు. విదేశాలలో షూటింగ్‌ జరుపుకునే సినిమాలు.. ప్యాచ్‌ వర్క్‌ మధ్యలో ఆగిపోయిన సినిమాలన్నీ 25నుంచే మొదలవుతాయన్నారు. ఇక సెప్టెంబర్ 1 నుంచి.. మిగిలిన వారందరూ.. షూటింగ్‌ స్టార్ట్ చేసుకోవచ్చని చెప్పారు దిల్ రాజు. అంతేకాదు ప్రొడ్యూసర్లందరూ ఇన్ని రోజుల చర్చించి తీసుకున్న నిర్ణయాలను.. ఆగస్టు 30న ఫిల్మ్ ఇండస్ట్రీకి వెల్లడిస్తాం అని చెప్పారు దిల్ రాజు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి