
తెలుగులో సుమారు 300 సినిమాలకు పైగా సినిమాల్లో నటించారు పావలా శ్యామల. తన అద్భుతమైన నటనతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు. గోలీమార్ వంటి సినిమాల్లో పావలా శ్యామల పండించిన కామెడీని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. అయితే ప్రస్తుతం ఆమె వృద్ధాప్య సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. వీటికి తోడు ఆర్థిక సమస్యలు పావలా శ్యామల జీవితాన్ని ప్రశ్నార్థకం చేశాయి. ప్రస్తుతం ఓ అనాథాశ్రమంలో ఉంటోన్న ఆమె తన ఆవేదనను అందరితో పంచుకున్నారు. ‘నేను నటిగా కొనసాగుతున్న సమయంలో వచ్చిన డబ్బు మొత్తం నా కుమార్తె అనారోగ్య సమస్యలకు చికిత్స చేయించడానికి ఖర్చు చేశాను. ప్రస్తుతం నా వయసు పైబడింది నేను సినిమాలలో నటించే పరిస్థితి కూడా లేదు. సంపాదించిన డబ్బు మొత్తం వైద్యం కోసమే ఖర్చు చేశాం. ప్రస్తుతం నేను నా కూతురు అనాథల్లాగా బతుకుతున్నాం. నా ఈ పరిస్థితి చూసి చాలామంది హీరోలు సహాయం చేశారు. చిరంజీవి కూడా నాకు లక్షల్లో సహాయం చేసి ఆదుకున్నారు. అంతేకాదు గతంలో లక్ష రూపాయలు వెచ్చించి ‘మా’లో మెంబర్‌షిప్‌ను చిరంజీవి ఇప్పించారు. అలాగే నా కూతురి ఆరోగ్యం గురించి తెలుసుకుని మరో రెండు లక్షల ఆర్థిక సాయం చేశారు’
కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాకు పదివేల రూపాయల పెన్షన్ వచ్చేది. ఇప్పుడు కూడా ఆ పెన్షన్ తోనే బ్రతుకుతున్నాం. దిల్ రాజు కూడా నా పరిస్థితి చూసి సాయం చేస్తామన్నారు. మా మేనేజర్ మీతో మాట్లాడతారని చెప్పారు. కానీ ఇప్పటివరకు దిల్ రాజు గారి నుంచి నాకు ఎలాంటి సహాయం అందలేదు. అలాగే సాయం కోసం కొందరు స్టార్ హీరోల ఇంటికి వెళ్లాను. కానీ అక్కడ భాష రాని హిందీ వాచ్ మెన్లు నన్ను దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. నాకు ఏదైనా అయితే నా కూతురు ఒంటరిగా మిగిలిపోతుందని బాధగా ఉంది. అందుకే ఇలాంటి బాధలు పడే కంటే నేను నా కూతురు చనిపోతే బాగుండు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు పావలా శ్యామల. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతన్నాయి. సినీ ప్రముఖులు ఆమెను ఆదుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
Tollywood: 17 ఏళ్లకే సినిమాల్లోకి.. బిగ్ బాస్‌తో ఎనలేని క్రేజ్.. ఈ విజయవాడ బ్యూటీని గుర్తు పట్టారా?
Tollywood: ఏంటమ్మా ఇది! వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నెటిజన్ల ఆగ్రహం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.