
టాలీవుడ్ సీనియర్ నటి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె కన్నతల్లి కోళ్ల లక్ష్మి (80) కన్నుమూశారు. వయసు సంబంధిత సమస్యలతో పాటు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఆమె సోమవారం (నవంబర్ 17) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న హేమ కన్నీరుమున్నీరైపోయింది. వెంటనే హైదరాబాద్ నుంచి తన స్వగ్రామం రాజోలుకు వచ్చింది. తల్లి పార్థీవ దేహాన్ని చూసి బోరున విలపించింది. నిన్న ఉదయం తనతో బాగానే మాట్లాడిందని, ఇంతలోనే ఇలా ఘోరం జరిగిపోయిందని చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చేసింది. దీంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు హేమను ఓదార్చారు. అనంతరం సోంపల్లి కైలాస భూమిలో జరిగిన లక్ష్మి అంత్యక్రియల్లో హేమతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హేమకు కోళ్ల శ్రీనివాస్ అనే ఒక సోదరుడు ఉన్నాడు.
తెలుగులో వందలాది సినిమాల్లో సహాయక నటిగా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది హేమ. హీరోలు, హీరోయిన్లకు తల్లిగా, పిన్నిగా, అక్కగా, వదినగా ఇలా అన్ని పాత్రల్లోనూ నటించి మెప్పించింది. చాలా సినిమాల్లో తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. సినిమాలతో పాటు ప్రముఖ తెలుగు రియాలిటీ బిగ్ బాస్ షోలోనూ సందడి చేసిందీ సీనియర్ నటీమణి. పలు టీవీ షోల్లోనూ సందడి చేసింది. అయితే గతేడాది ఓ రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకుందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కొన్ని రోజులు బెంగళూరు జైలులో ఉన్న ఆమె బెయిల్ పై బయటకు వచ్చింది. తాను డ్రగ్స్ తీసుకోలేదని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది హేమ. అదే సమయంలో తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలు, జైలుకెళ్లడం చూసి తల్లి తట్టుకోలేకపోయిందని, అనారోగ్యానికి గురైందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. ఇప్పుడు లక్ష్మీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచింది.
Actress Hema Mother
కాగా హేమ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. ఆ మధ్యన తనపై వచ్చిన ఆరోపణలతో మనస్థాపానికి గురైన ఆమె ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటోంది .
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.