కారు దిగి ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేస్తున్న ఈయన టాలీవుడ్‌లో ఓ బడా నిర్మాత.. ఎవరో గుర్తుపట్టారా?

|

Jan 03, 2023 | 1:16 PM

కోట్లాదిమందికి ఆశ్రయమిస్తోన్న మన హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోడ్లను విస్తరిస్తున్నా, ట్రాఫిక్‌ నిబంధనలు పక్కాగా అమలు చేస్తోన్న ఈ సమస్య తీరడం లేదు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక్కసారి వాహనంతో రోడ్లపైకి వస్తే అంతే సంగతులు.

కారు దిగి ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేస్తున్న ఈయన టాలీవుడ్‌లో ఓ బడా నిర్మాత.. ఎవరో గుర్తుపట్టారా?
Suresh Babu
Follow us on

కోట్లాదిమందికి ఆశ్రయమిస్తోన్న మన హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోడ్లను విస్తరిస్తున్నా, ట్రాఫిక్‌ నిబంధనలు పక్కాగా అమలు చేస్తోన్న ఈ సమస్య తీరడం లేదు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక్కసారి వాహనంతో రోడ్లపైకి వస్తే అంతే సంగతులు.. ఇంటికి చేరుకోవాలంటే కొన్ని గంటలు పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు కారు దిగి స్వయంగా ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేశారు. సోమవారం (జనవరి2) రాత్రిజూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ నగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో అటువైపుగా వెళ్తున్న సురేష్‌ బాబు స్వయంగా కారులోంచి దిగి ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేశారు. రోడ్డుపై నిలబడి వాహనదారులకు సూచనలు అందిస్తూ ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ఒక  సినిమా సెలబ్రిటీ రోడ్డుపైకొచ్చి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయడం వాహనదారులను ఆకట్టుకుంది. ఈ సంఘటనను పలువురు తమ ఫోన్లలో చిత్రీకరించారు. అనంతరం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో బాగా వైరలవుతోంది. బాధ్యతగల పౌరుడిలా వ్యవహరించారంటూ సురేష్‌ బాబుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గత కొంతకాలంగా సినిమాలు తీయటం తగ్గించారు సురేశ్‌ బాబు. 2021లో వెంకటేశ్‌ నటించిన నారప్ప తర్వాత పూర్తి స్థాయి నిర్మాతగా మరే సినిమాను తెరకెక్కించలేదు. ఇక ఈ ఏడాది శాకినీ డాకినీ, దొంగలున్నారు జాగ్రత్త, ప్రిన్స్‌ వంటి సినిమాలకు కో ప్రోడ్యూసర్‌గా మాత్రమే వ్యవహరించారు. అలాగే రానా దగ్గుబాటి నటించిన విరాట పర్వం సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించారు. ఇక ఇటీవల టాలీవుడ్‌లో తెలుగు, తమిళ సినిమాల రిలీజ్ విషయంపై స్పందించి మరోసారి వార్తల్లో కెక్కారు సురేశ్‌ బాబు.  సంక్రాంతి సీజన్‌లో  తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల తెలుగు నిర్మాతల మండలి లేఖపై స్పందించిన దిల్ రాజుకు మద్దతునిస్తూ మాట్లాడారు.  తెలుగు భాషకు సరిహద్దులు లేవంటూ సంక్రాంతి సీజన్‌లో అన్ని సినిమాలు నడుస్తాయంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..