మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఇంద్ర ఒకటి. అప్పట్లో ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్, డైలాగ్స్ ఇప్పటికీ నెట్టింట ట్రెండ్ అవుతుంటాయి. ఇందులో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై నిన్నటికి 22 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ఆగస్ట్ 22న విడుదల చేస్తామని ప్రకటించారు నిర్మాతలు. దీంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో ఇంద్ర సినిమాకు సంబంధించిన పోస్టర్స్, వీడియోస్ తెగ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ ఫేమస్ ప్రొడ్యూసర్ త్రోబ్యాక్ ఫోటోను పంచుకున్నారు. పైన ఫోటోను చూశారు కదా.. ఇంద్ర సక్సెస్ సెలబ్రేషన్లలో స్పీచ్ ఇస్తున్న ఆ వ్యక్తిని గుర్తుపట్టండి.. ఇటీవలే ఓ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని అడియన్స్ ముందుకు తీసుకువచ్చిన నిర్మాత. అలాగే మెగాస్టార్ వీరాభిమాని. అతడు మరెవరో కాదు.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ (SKN).
చిరంజీవి స్పూర్తితో వచ్చి ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు నిర్మాత SKN ఒకరు. చిరంజీవి అభిమానిగా సినీరంగంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడి సక్సెస్ ఫుల్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలే కాకుండా.. స్టేజ్ పై తనదైన స్పీచ్ తో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటారు. ఇటీవలే బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. ఇటీవలే పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచిన సందర్భంగా ఆ ఊరిలో ఓ కుటుంబానికి ఆటో బహుమతిగా అందించారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఇంద్ర సినిమా విడుదలై 22 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఓ పాత ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు SKN. “మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాకు 22 ఏళ్లు. నా హృదయానికి బాగా దగ్గరైన సినిమా. ఏలూరులో జరిగిన ఇంద్ర సక్సెస్ మీట్ లో నేను మాట్లాడుతుండగా తీసిన ఫోటో ఇది. ఇంద్ర సినిమా 35 సార్లు చూసాను. అప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి” అంటూ ట్వీట్ చేశారు. SKN మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. ఏలూరు చిరంజీవి ఫ్యాన్స్ అసోషియేషన్ ను కొన్నాళ్లు నడిపారు.. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి సినీరంగంలో నిర్మాతగా మారారు.
22 glorious years of Megastar @KChiruTweets gari #Indra
A film close to my heart
Here is the photo of my speech of Indra success meet at Eluru ❤️💕
Watched 35 times in theater
Vintage Mega memories
#50YearsOfVyjayanthiMovies #22YearsForIHIndra @AshwiniDuttCh #BGopal… pic.twitter.com/fqh0mYrS9g— SKN (Sreenivasa Kumar) (@SKNonline) July 24, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.