Tollywood: సినీ కార్మికులదే పైచేయి.. చర్చలు సఫలం.. రేపటి నుండి సినిమా షూటింగ్‌లు షురూ..

|

Jun 23, 2022 | 3:16 PM

టాలీవుడ్ (Tollwood)సినీ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. తమకు వేతనాలు పంచేవరకు షూటింగ్స్‏కు హాజరుకాబోమని బుధవారం సినీ కార్మికులు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.

Tollywood: సినీ కార్మికులదే పైచేయి.. చర్చలు సఫలం.. రేపటి నుండి సినిమా షూటింగ్‌లు షురూ..
Tollywood
Follow us on

టాలీవుడ్ (Tollywood)సినీ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. తమకు వేతనాలు పంచేవరకు షూటింగ్స్‏కు హాజరుకాబోమని బుధవారం సినీ కార్మికులు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. తాము వేతనాలు పెంచేందుకు సిద్దంగా ఉన్నామని..ఆకస్మికంగా ఇలా సమ్మె చేపట్టడం సరైనది కాదంటూన్నారు తెలుగు చిత్ర నిర్మాతలు.. ఈ క్రమంలోనే ఇరువర్గాలు ఎవరికి వారే మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. తలసాని జోక్యంతో చర్చలు సఫలం అయ్యాయి. రేపటి నుండి సినిమా షూటింగ్ లు ప్రారంభంకానున్నాయి. ఈ సంధర్భంగా నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. మంత్రి తలసాని జోక్యంతో ఈ రోజు మీటింగ్ పెట్టుకున్నాం..రేపటి నుంచి యధావిధిగా షూటింగ్స్ జరుగుతాయి అని అన్నారు. రేపు కో ఆర్డినేషన్ కమిటీ డిసైడ్ చేసిన తరువాత జీతాల పై క్లారిటీ వస్తుందని, ఫిల్మ్ ఛాంబర్ , ఫిల్మ్ ఫెడరేషన్ ద్వారా.. సాలరీస్ ఇస్తమని తెలిపారు కళ్యాణ్. రేపు ఛాంబర్, ఫెడరేషన్ దిల్ రాజు అధ్యక్షతన సమావేశం అవుతుందని వెల్లడించారు. అలాగే

ఫిల్మ్ ఫెడరేషన్  అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. వేతనాల సమస్యపై మీటింగ్ పెట్టుకున్నామని, వేతనాలు పెంచడానికి ఛాంబర్ సభ్యులు ఒప్పుకున్నారని అన్నారు. ఆలాగే పెంచిన వేతనాలు రేపటి నుంచి అమలులోకి వస్తాయని, రేపు కమిటీ వేతనాలు డిసైడ్ చేస్తాయని, రేపటి నుంచి షూటింగ్స్ కొనసాగుతాయని తెలిపారు. రేపు (24)న దిల్ రాజు అధ్యక్షతన కోఆర్డినెషన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశం లో విధి విధానాలపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి