Viral Photo: తెలుగులో టాప్ హీరోల సరసన నటించిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

ప్రజంట్ పండుగ సీజన్ తో పాటు కరోనా సీజన్ లోనూ ఉన్నాం. ఈ సమయంలో మనకు మాస్కే మెయిన్ వెపన్. మాస్క్ ధరించకపోతే.. రిస్క్ ను కావాలని ఆహ్వానించినట్టే అవుతుంది.

Viral Photo: తెలుగులో టాప్ హీరోల సరసన నటించిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
Tollywood Heroine

Updated on: Jan 14, 2022 | 1:09 PM

Tollywood: ప్రజంట్ పండుగ సీజన్ తో పాటు కరోనా సీజన్ లోనూ ఉన్నాం. ఈ సమయంలో మనకు మాస్కే మెయిన్ వెపన్. మాస్క్ ధరించకపోతే.. రిస్క్ ను కావాలని ఆహ్వానించినట్టే అవుతుంది. కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి మాస్క్ ధరించండి, భౌతికదూరం పాటించండి అని ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉన్నారు. కానీ కొందరు మాత్రం పెడచెవిన పెడుతూనే ఉన్నారు. సెలబ్రిటీలు సైతం మాస్క్ ప్రాముఖ్యతను వివరిస్తూనే ఉన్నారు. నటి మమతా మోహన్ దాస్ వీలు చిక్కినప్పుడల్లా తన సోషల్ మీడియా అకౌంట్ల వేదికగా మాస్క్ ప్రాముఖ్యతను తెలియజేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మమతా మోహన్ దాస్ స్పెషల్ ఇమేజ్ దక్కించుకున్నారు. ఏ భాషనైనా అవలీలగా పలికేయడం మమతా మోహన్ దాస్ కు వెన్నతో పెట్టిన విద్య. అంతేకాదు ఈమె మంచి సింగర్ కూడా. తెలుగులోనూ పలు చిత్రాల్లో పాటలు పాడేసింది. క్యాన్సర్ ను జయించి మరి సినిమాల్లో రీ-ఎంట్రీ ఇచ్చిన మమత ఎంతోమందికి ఆదర్శం. యమదొంగ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. విక్టరీ, హోమం, చింతకాయల రవి, కింగ్, కేడీ వంటి చిత్రాల్లో నటించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మమతా మోహన్ దాస్ మలయాళ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ఆమె చేతిలో 10 సినిమాలు ఉన్నాయి.  అయితే ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను పలకరించి దశాబ్దం దాటిపోయింది. కాగా సోషల్ మీడియా వేదికగా పలుసార్లు ప్రజలు మాస్క్ పెట్టుకోవాలని పిలుపునిచ్చింది ఈ హీరోయిన్.


Also Read:  ‘అమ్మా నేనెట్టా బ్రతికేది’.. తల్లికి అంత్యక్రియలు చేసిన శ్మశానవాటికలో తనయుడు ఆత్మహత్య

అక్క ఆడపడుచుతో ప్రేమలో పడ్డ యువతి.. చివరికి ఊహించని ట్విస్ట్