రానా సినిమా పై కరోనా ఎఫెక్ట్.. అక్కడ విడుదలను వాయిదా వేసిన చిత్రయూనిట్.. నిరాశలో అభిమానులు..

Haathi Mere Saathi Movie Update: గత మూడు నెలలుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు ఇటీవల గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో పాక్షిక లాక్‏డౌన్‏లు

రానా సినిమా పై కరోనా ఎఫెక్ట్.. అక్కడ విడుదలను వాయిదా వేసిన చిత్రయూనిట్.. నిరాశలో అభిమానులు..
Rana Haathi Mere Saathi Mov
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 23, 2021 | 9:38 PM

Haathi Mere Saathi Movie Update: గత మూడు నెలలుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు ఇటీవల గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో పాక్షిక లాక్‏డౌన్‏లు ప్రకటించగా.. మరికొన్ని రాత్రి సమయంలో కర్ఫ్యు నిబంధనలు కొనసాగిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. మరోసారి ఈ కోవిడ్ మాహామ్మారి సినీ పరిశ్రమను ఆందోళనకు గురిచేస్తుంది. లాక్ డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకోగా.. కొన్ని సినిమాలు విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మరికొన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక భారీ బడ్జెట్ సినిమాలు ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని వేసవి కాలంలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. దాదాపు అన్ని అగ్రహీరోల సినిమాలు విడుదల తేదీలను ప్రకటించేసాయి.

ఇక ఇటీవల కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో.. ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకుంటుంది. ఇక ఈ కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీపై మరోసారి ప్రభావం చూపించనున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా.. సినిమాలను వాయిదా వేయాలని భావిస్తున్నారు పలు చిత్రనిర్మాతలు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ హీరో రానా నటించిన హాథీ మేరీ సాథీ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి.. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఎరోస్ నౌ తన ట్విట్టర్ ఖాతాలో  ఈ విషయాన్ని తెలియజేసింది. ” ప్రియమైన ప్రేక్షకులకు.. ఈ వార్తను మీతో పంచుకోవడం బాధాకరం. కొవిడ్‌19 మరోసారి విజృంభిస్తున్న తరుణంలో ‘హాథీ మేరీ సాథీ’ విడుదల వాయిదా వేయాలని నిర్ణయించాం. తర్వాతి అప్డేట్‌ గురించి త్వరలోనే ప్రకటిస్తాం. తెలుగులో ‘అరణ్య’, తమిళంలో ‘కాదన్‌’ యథావిధిగా మార్చి 26న విడుదలవుతాయి’ అని పేర్కొంది. కానీ ఈ సినిమా విడుదల కేవలం హిందీ వెర్షన్ మాత్రమే వాయిదా పడింది. చిత్రయూనిట్ ముందుగానే ప్రకటించిన తేదీకి తెలుగు, తమిళ్ వెర్షన్స్‏లో మార్చి 26న విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రభుసాల్మన్‌ దర్శకత్వం వహించాడు.

ఎరోస్ నిర్మాణ సంస్థ ట్వీట్..

Also Read:

Adipush Movie: మరోసారి ‘ఆదిపురుష్’ సినిమాపై స్పందించిన డైరెక్టర్.. ఏమన్నాడంటే..