Tollywood: రూ.55 కోట్ల ఛీటింగ్ కేసు.. నేరాన్ని అంగీకరించిన టాలీవుడ్‌ యంగ్‌ హీరో.. చర్లపల్లి జైలుకు తరలింపు

సినిమా ఇండస్ట్రీలో హీరో, డైరెక్టర్‌గా చెలామణి అవుతూ మోసాలకు పాల్పడిన నవీన్‌ అట్లూరి పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం సీసీఎస్‌ పోలీసుల అదుపులో ఉన్న అతనిని సుమారు రెండు రోజులుగా విచారిస్తున్నారు. ఈనేపథ్యంలో రూ.38 కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు విచారణలో నవీన్‌ అంగీకరించాడని పోలీసులు తెలిపారు

Tollywood: రూ.55 కోట్ల ఛీటింగ్ కేసు.. నేరాన్ని అంగీకరించిన టాలీవుడ్‌ యంగ్‌ హీరో.. చర్లపల్లి జైలుకు తరలింపు
Naveen Reddy Atluri
Follow us
Basha Shek

|

Updated on: Feb 07, 2023 | 1:05 PM

సినిమా ఇండస్ట్రీలో హీరో, డైరెక్టర్‌గా చెలామణి అవుతూ మోసాలకు పాల్పడిన నవీన్‌ అట్లూరి పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం సీసీఎస్‌ పోలీసుల అదుపులో ఉన్న అతనిని సుమారు రెండు రోజులుగా విచారిస్తున్నారు. ఈనేపథ్యంలో రూ.38 కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు విచారణలో నవీన్‌ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. దీంతో అతనిని చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా జాయింట్ వెంచర్ పేరుతో స్నేహితుడు సరీన్ రెడ్డి తో వ్యాపారం ప్రారంభించాడు నవీన్‌. సార్క్ ఎన్ స్క్వేర్ పేరుతో ప్రాజెక్టులు తీసుకున్నాడు. అయితే సరీన్ రెడ్డి సంతకం ఫోర్జరీ చేసి రూ. 7 కోట్లు విలువ చేసే భూమిని సరీన్ రెడ్డికి తెలీయకుండానే అమ్మేశాడు. అదేవిధంగా రూ. 9 కోట్లు విలువచేసే భూమిని కస్టమర్లకు ప్లాట్ ల రూపంలో విక్రయించాడు. అదే సమయంలో తన కార్యాలయాన్ని జూబ్లీహిల్స్ నుండి గచ్చిబౌలికి మకాం మార్చాడు. మోసపోయిన విషయాన్ని గ్రహించిన సరీన్‌ రెడ్డి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని నవీన్‌ను కోరాడు. అంతేకాదు ఎన్ స్వ్కేర్ కంపెనీ సహ డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టాడు. ఫోర్జరీ సంతకాలు చేసి కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న సహ డైరెక్టర్లు పోలీసులను ఆశ్రయించారు. దీంతో సీసీఎస్‌ పోలీసులు నవీన్ రెడ్డిపై 420, 465,468,471 r/w 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత రెండు రోజులుగా పోలీసుల విచారణలో నవీన్‌ రెడ్డి ఫోర్జరీ చేసినట్లు అంగీకరించాడు. మోసం చేసిన డబ్బులతో నవీన్‌ జల్సాలు చేశాడని తెలుస్తోంది. ఈ డబ్బుతో తానే హీరోగా నోబడీ అనే సినిమా కూడా తీశాడు. సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, కోడిపుంజులగూడెం కు చెందిన ఇతనిపై గతంలో బైక్ దొంగతనం కేసులు కూడా ఉన్నాయి. మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..