Rana Daggubati – Tollywood Drugs Case: ఈడీ ముందు ఏడు గంటలు. దగ్గుబాటి రానా విచారణ ముగిసింది. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్‌తో కలిపి విచారించారు అధికారులు. ఈసారి కెల్విన్ ల్యాప్‌టాప్ తెరిచారు. అందులో ఉన్న సమాచారంతో.. ఇద్దరి సమాధానాలు సరిపోల్చుతూ ప్రశ్నల వర్షం కురిపించారు. 2016 నవంబర్‌లో F-క్లబ్ జరిగిన పార్టీపైనా విచారణ చేశారు. రానా బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించి వివరాలపైనా ఈడీ ఆరా తీసింది. 2015 నుంచి మూడేళ్ల వరకు బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులకు అందజేశారు రానా.
ఇలా ఉండగా, డ్రగ్స్ కేసుకు సంబంధించి నిన్న కెల్విన్, కుధూస్ లను ఈడీ అధికారులు 7 గంటల పాటు విచారించారు. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో 30 మందికి పైగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అందులో కీలకంగా కెల్విన్, వహీద్, ఖుద్ధూస్, జీషాన్ లను గతంలోనే విచారించి వారి బ్యాంక్ ఖాతాలను ఈడీ పరిశీలించింది. వీరి బ్యాంక్ ఖాతాల నుండి విదేశాలకు భారీగా డబ్బు వెళ్లినట్టు ఆధారాలు ఈడీ అధికారులకు లభించాయి. సినీ తారల బ్యాంక్ ఖాతాల నుండి కెల్విన్, ఖుధూస్, వహీద్, జీశాన్‌ల ఖాతాలకు మధ్య లావాదేవీలు జరిగినట్టు కూడా తేలింది. వీటి ఆధారంగా డ్రగ్స్ కేస్ లో మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తించారు.
కాగా, టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ఊహించని విధంగా మలుపులు తిరుగుతోంది. అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరైన నందుతో పాటు మిగిలిన 8మంది నుంచి పూర్తి వివరాలు రాబట్టేందుకు కేసు మూలాలు తోడుతోంది ఈడీ. ఇందుకోసం కీలక సూత్రధారిని తమ అదుపులోకి తీసుకుంది. అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరైన నందుని 5 గంటలుగా విచారిస్తూనే మధ్యలో కెల్విన్‌ని ఈడీ ఆఫీస్‌కి రప్పించి అరెస్ట్ చేశారు.