Tollywood Drugs case: ఈడీ కార్యాలయానికి చేరుకున్న నవదీప్.. ప్రశ్నల వర్షం కురిపించనున్న అధికారులు..

Navdeep: టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం కొనసాగుతుంది. ఎక్కడో తీగ లాగితే టాలీవుడ్ డొంకలు కదులుతున్నాయి. ఇప్పటికే నిఘా పెట్టిన ఈడీ అధికారులు.

Tollywood Drugs case: ఈడీ కార్యాలయానికి చేరుకున్న నవదీప్.. ప్రశ్నల వర్షం కురిపించనున్న అధికారులు..
Navadeep

Updated on: Sep 13, 2021 | 11:12 AM

Tollywood Drugs case: టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం కొనసాగుతుంది. ఎక్కడో తీగ లాగితే టాలీవుడ్ డొంకలు కదులుతున్నాయి. ఇప్పటికే నిఘా పెట్టిన ఈడీ అధికారులు. ఒకొక్కరిని పిలిచి విచారిస్తున్నారు. డ్రగ్స్ ముఠాలతో ఉన్న సంబంధాలపై.. సప్లేయిర్ కెల్విన్‌తో ఉన్న లింకుల గురించి. బ్యాంక్ లావాదేవీల గురించి ఆరాతీసుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పూరిజగన్నాథ్. ఛార్మి, రకుల్, నందు, రానా, రవితేజాలను ఈడీ అధికారులు విచారించారు. కాగా నేడు యంగ్ హీరో నవదీప్ వంతు వచ్చింది. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే నవదీప్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక నవదీప్ పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించనుంది ఎఫ్-క్లబ్‌లో డ్రగ్ పార్టీలు జరిగాయా?, సినీ ప్రముఖుల్లో ఎవరెవరు ఎఫ్-క్లబ్ కి వచ్చేవారు? కెల్విన్‌తో నీకు ఎలా పరిచయం? కెల్విన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారా? కెల్విన్‌కి ఎప్పుడైనా మనీ ట్రాన్స్ ఫర్ చేశారా? కెల్విన్ ఫ్రెండ్ జీషాన్ అలీతో సంబంధముందా? ఇలాంటి ప్రశ్నలను ఈడీ సంధించనుంది.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నవదీప్ అండ్ ఎఫ్-క్లబ్బే కీలకం. ఎఫ్-క్లబ్ కేంద్రంగానే డ్రగ్స్ పార్టీలు, కార్యకలాపాలు జరిగేవి. ఎఫ్-క్లబ్ కి అప్పటి ఓనర్ నవదీప్. 2016లో ఎఫ్-క్లబ్ కేంద్రంగానే నవదీప్ అనేక పార్టీలను ఆర్గనైజ్ చేశాడు. ఈ పార్టీల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ సప్లై జరిగేదని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ కోణంలోనే అధికారులు నవదీప్ ను ప్రశ్నించనున్నారు. నవదీప్‌ తో పాటు  ఎఫ్‌-క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ కు విచారణకు హాజరయ్యాడు. ఇక ఇప్పటికే విచారణకు వచ్చిన సెలబ్రెటీలను దాదాపు ఆరు గంటలకు పైగా ప్రశ్నిస్తుంది ఈడీ . మరి నవదీప్ విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Saranga Dariya Song: కొరియన్ అమ్మాయి నోటా సారంగదరియా పాట.. వింటే మీరు కూడా ఫిదా అయిపోతారు..

Nabha Natesh: సినిమాలు చేస్తూనే అవి కూడా చేస్తానంటున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Deepika Padukone: డిప్రెషన్‏తో చనిపోదామనుకున్నా.. ఆ బాధ మరెవరికి రాకూడదు.. దీపికా పదుకొనే ఎమోషనల్ కామెంట్స్..