టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బిగ్ బ్రేకింగ్ అందుతోంది. ఈ కేసులో ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో తరుణ్‌లకు క్లీన్ చిట్ ఇచ్చింది. పూరి జగన్నాథ్, తరుణ్ డ్రగ్స్ తీసుకున్నట్టు ఆనవాళ్లు లేవని ఎఫ్‌ఎస్‌ఎల్ వెల్లడించింది. వీరివురి బ్లడ్, హెయిర్, గోళ్ళ నమూనాలను సేకరించిన ఎఫ్‌ఎస్‌ఎల్.. రిపోర్ట్‌లో డ్రగ్స్ తీసుకోలేదని వెల్లడించింది. 2017 జులైలో ఎక్సైజ్ కేసు విచారణలో భాగంగా డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు సెలబ్రిటీల నుంచి బ్లడ్ , హెయిర్ , గోళ్ళ నమూనాలను ఎఎఫ్‌ఎల్ సేకరించింది. వారు స్వచ్చందంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు ఇచ్చారని ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. గతేడాది డిసెంబరు 8న ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కు ఎఫ్ఎస్ఎల్ నివేదికలు సమర్పించింది. కెల్విన్‌పై ఛార్జ్ షీట్ తో పాటు ఈ వివరాలను ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ తాజాగా కోర్టుకు సమర్పించింది. ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ వాంగ్మూలాన్ని కూడా కోర్టుకు సమర్పించింది. మరో వైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబరు 9న విచారణకు హాజరు కావాలని కెల్విన్‌ను కోర్టు ఆదేశించింది.
డ్రగ్స్ కేసులో కొనసాగుతోన్న ఈడీ విచారణ…
డ్రగ్స్ కేసుకు సంబంధించిన లింక్‌లేంటి? మనీ లాండరింగ్ లెక్కలేంటి? అంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ టాలీవుడ్ ప్రముఖులను విచారిస్తోంది. ఆగస్ట్ 31న ప్రారంభమైన విచారణ.. ఈ నెల 22నతో ముగియనుంది. మొత్తం 12 మందిని విచారించనున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే పూరీ జగన్నాథ్ విచారణ ముగియగా.. ఈ నెల 22న తరుణ్ హాజరు కావల్సి ఉంది. ఇంతలోపే FSL రిపోర్ట్ పూరి, తరుణ్‌లకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలియడం ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో ఈడీ విచారణ ఏ విధంగా సాగనుందన్నది ఇంట్రెస్టింట్‌గా మారింది.
Also Read: చిక్కుల్లో సోనూసూద్.. పన్ను ఎగవేతపై ఐటీ శాఖ కీలక ప్రకటన.. షాక్‌లో అభిమానులు