కోలీవుడ్ డైరెక్టర్ కే.ఎస్ రవికుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. ఆయన డైరెక్ట్ చేసిన చాలా సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ అయ్యాయి. తెలుగు హీరోలతోనూ ఈ డైరెక్టర్ మంచి సినిమాలు తీశాడు. చిరంజీవి హీరోగా స్నేహం కోసం, నాగార్జున హీరోగా బావ నచ్చాడు, రాజశేఖర్ హీరోగా విలన్, బాలయ్య హీరోగా జైసింహా, రూలర్ లాంటి సినిమాలు తీశారు. తెలుగులో మంచి విజయం సాధించిన భద్ర మూవీని.. తమిళంలో శింబు హీరోగా రీమేక్ చేశారు ఈ డైరెక్టర్. 2008లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన దశావతారంను డైరెక్ట్ చేసింది కూడా కేఎస్ రవి కుమారే. భారీ చిత్రాలు తెరకెక్కించడంతో నిష్ణాతుడిగా ఆయనకు పేరుంది. అయితే ఫ్యామిలీ గురించి మన తెలుగు వాళ్లు చాలా మందికి తెలియకపోవచ్చు. కె.ఎస్.రవికుమార్‌కు మొత్తం ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
అందులో చిన్న కుమార్తె జస్వంతి సోషల్ మీడియాలో తెగ పాపులర్. హీరోయిన్ ఫీచర్స్ ఉండే ఈ అమ్మాయి ఖతర్నాక్ ఫోటోలతో నెట్టింట సెన్సేషనల్‌గా మారిపోయింది. ఈ అమ్మడు ఫోటోలు చూసి.. ఇంతకాలం ఈమె హీరోయిన్ కాకుండా ఎందుకు ఉంది అని కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.ఈ చిన్నదాని క్రేజీ ఫోటోలకు కుర్రాళ్ళు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు. కొంటె కామెంట్స్ పెడుతున్నారు. ఈ బ్యూటీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.