AP Government: అర్ధం చేసుకోండి.. జగన్ సర్కార్‌కు దర్శకేంద్రుడి సంచలన లేఖ..

|

Dec 01, 2021 | 7:03 PM

ఆంధ్రప్రదేశ్ ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టం వల్ల...

AP Government: అర్ధం చేసుకోండి.. జగన్ సర్కార్‌కు దర్శకేంద్రుడి సంచలన లేఖ..
Follow us on

ఆంధ్రప్రదేశ్ ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టం వల్ల థియేటర్స్ యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు నష్టపోతారని పలువురు ఇండస్ట్రీ పెద్దలు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఏపీ ప్రభుత్వానికి ఓ సంచలన లేఖ రాశారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం తగిన న్యాయం చేయాలంటూ పేర్కొన్నారు.

‘ప్రేక్షకులు, థియేటర్ యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు.. ఇలా అందరూ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుటుంది. ప్రస్తుతం టికెట్లు, షోస్‌పై తీసుకున్న నిర్ణయం చాలామందికి నష్టం చేకూరుస్తుంది. ఆన్‌లైన్ సిస్టం వల్ల దోపిడీ ఆగిపోతుందని అనుకోవడం కరెక్ట్ కాదు. కామన్ మాన్‌కు సినిమా ఒకటే ఎంటర్టైన్మెంట్. ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూడాలనుకుంటే రూ. 300 లేదా రూ. 500 అయినా పెట్టి మరీ చూస్తాడు. ఒక రూపాయికే సినిమా చూపిస్తామన్నా.. అతడికి నచ్చని సినిమా చూడడు. కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు అడ్డగించి.. వాటిని వాళ్ల శిష్యుల ద్వారా బ్లాక్‌లో అమ్ముతున్నారు. అదే రేట్లు పెంచి ఆన్‌లైన్‌లో అమ్మితే థియేటర్స్ వల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగిన న్యాయం చేయాలి’ అని రాఘవేంద్రరావు లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: ఈ చిరునవ్వుల చిన్నది ఇప్పుడొక టాలీవుడ్ హీరోయిన్.. మన తెలుగమ్మాయి కూడా.. ఎవరో కనిపెట్టండి!