Tollywood: సెలబ్రిటీల పెళ్లిళ్లా.. మజాకానా.! అప్పుడు పనికిరాలేదు.. ఇప్పుడు పనికొచ్చే సెన్సేషన్‌గా మారాయ్..

సాధారణంగా పెళ్లి వేడుకలకు సంబంధించిన వార్తలు పెద్దగా ట్రెండ్ అవ్వవు. కానీ రీసెంట్ టైమ్స్‌లో పరిస్థితులు మారిపోయాయి. సెలబ్రిటీ వెడ్డింగ్ సెన్సేషన్ అవుతున్నాయి. న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో ట్రెండ్ అవుతున్నాయి. టాప్ స్టార్స్‌ కు సంబంధించి పెళ్లి వార్తలు నేషనల్ లెవల్‌లో బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

Tollywood: సెలబ్రిటీల పెళ్లిళ్లా.. మజాకానా.! అప్పుడు పనికిరాలేదు.. ఇప్పుడు పనికొచ్చే సెన్సేషన్‌గా మారాయ్..
Samantha Marriage

Edited By: Ravi Kiran

Updated on: Dec 04, 2025 | 1:03 PM

స్టార్ హీరోయిన్‌ సమంత మళ్లీ పెళ్లి చేసుకున్నారన్న న్యూస్‌ ఇప్పుడు నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది. చాలా రోజులుగా దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో సమంత ప్రేమలో ఉన్నారన్న వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ వార్తలను సామ్‌ గానీ, రాజ్‌ గానీ ఖండించకపోవటం… ఆ తరువాత కూడా పదే పదే కలిసి కనిపిస్తుండటంతో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అన్న విషయంలో ఇండస్ట్రీతో పాటు ఫ్యాన్స్ కూడా ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ సోమవారం ఉదయం 7 గంటలకు ఈషా ఫౌండేషన్‌లోని లింగ భైరవి ఆలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. అతి కొద్ది మంది అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకను జరుపుకున్నారు. రెండు పెళ్లి సమంత సీక్రెట్‌గా చేసుకుంటే నాగచైతన్య మాత్రం కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. సమంతతో విడిపోయిన తరువాత నటి శోభితా ధూళిపాలకు కనెక్ట్ అయిన చైతూ… చాలా కాలం డేటింగ్ తరువాత ఇరు కుటుంబాల ఆమోదంతో ఆమెను పెళ్లి చేసుకున్నారు.

అక్కినేని హీరో అఖిల్ కూడా ఈ మధ్యే ఓ ఇంటి వాడయ్యాడు. గతంలో ఓ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఆ తరువాత చాలా రోజుల పాటు సింగిల్‌గానే ఉన్న సిసింధ్రి… ఫైనల్‌గా తన లాంగ్‌ టైమ్ గర్ల్‌ ఫ్రెండ్‌ జైనాబ్‌ను ఈ మధ్యే పెళ్లి చేసుకున్నారు. అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ వేడుక జరిగింది. న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో గట్టిగా ట్రెండ్‌ అయిన మరో సౌత్ సెలబ్రిటీ వెడ్డింగ్‌ సిద్ధార్థ్‌ – అదితి రావ్‌ హైదరీలది. ఆప్పటికే ఒకసారి రిలేషన్‌షిప్‌లో ఫెయిల్ అయి డైవర్స్ తీసుకున్న ఈ ఇద్దరు స్టార్స్‌… చాలా కాలం ఒకరినొకరు అర్ధం చేసుకున్న తరువాత గత ఏడాది నవంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి డేట్‌ వరకు రిలేషన్‌ గురించి ఎలాంటి ఎనౌన్స్‌మెంట్ ఇవ్వని జంట.. ఫ్యాన్స్‌ను వెడ్డింగ్ ఫోటోస్‌తో సర్‌ప్రైజ్ చేసింది.

నయనతార పెళ్లి వార్త సౌత్ ఇండియా షేక్ చేసింది. అప్పటికే ఇద్దరు టాప్ స్టార్స్‌తో నయన్‌ ప్రేమలో ఉన్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి. శ్రీరామరాజ్యం షూటింగ్ తరువాత ఆమె పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్‌ అప్పట్లో సెన్సేషన్ అయ్యింది. ఆ సినిమా తరువాత నటనకు దూరమవుతానని భావోద్వేగానికి గురయ్యారు. కానీ ఆ రిలేషన్‌ బ్రేక్ అవ్వటంతో మళ్లీ యాక్టింగ్ కెరీర్‌ మీద ఫోకస్ చేశారు నయన్‌. చాలా కాలం తరువాత దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో మళ్లీ ప్రేమలో పడ్డ నయనతార… 2022 జూన్‌ 9న పెళ్లి చేసుకున్నారు. వీళ్లే కాదు వరుణ్‌ తేజ్‌ – లావణ్య త్రిపాఠి, శిరీష్ – అనైనిక, మంచ మనోజ్‌ – మోనిక, రానా దగ్గుబాటి – మిహికా ఇలా యంగ్ హీరోస్ అంతా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నవారే. మొన్నటి మొన్న రాహుల్ సిప్లిగంజ్‌ కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు.