వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి నేడు ఘనంగా జరగనుంది. ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య నేడు ఒక్కటి కానున్నారు. ఇటలీలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరగనుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీ చేరుకున్నారు. సోషల్ మీడియాలో వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి సంబరాల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వరుణ్ లవ్ పెళ్ళికి టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. తాజాగా కాక్‌టెయిల్ పార్టీ, హల్దీ వేడుకలు ముగిసాయి. ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలో రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహాలు కలర్‌ఫుల్‌గా కనిపించారు. మిస్టర్ సినిమాతో తొలిసారి కలిసి నటించిన వరుణ్ తేజ్ లావణ్య.. ఆ మూవీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు ఈ ఇద్దరు. అప్పటి నుంచి వీరి ప్రేమ విషయాన్నీ చాలా సీక్రెట్ గా ఉంచారు.
ఇక వీరి ఎంగేజ్ మెంట్ కూడా పెద్దగా హడావిడి లేకుండా జరిగిపోయింది. ఇక నవంబర్ 1న మధ్యాహ్నం 2.48 నిమిషాలకు గ్రాండ్ గా జరగనుంది. అయితే ఈ పెళ్ళికి వెళ్తున్న సెలబ్రెటీలలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు.. సమంత, నాగచైతన్య, రష్మిక మందన్న , పూజాహెగ్డే.
వరుణ్ తేజ్, లావణ్య పెళ్ళికి సమంత, నాగచైతన్య హాజరుకానున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నవంబర్ 5న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి రెసెప్షన్ హైదరాబాద్ లో జరపనున్నారు. ఈ వేడుకకు మరికొంతమంది సెలబ్రెటీలు హాజరుకానున్నారు.
Happy Vinayaka chavithi!
Wishing you all great
health & prosperity. ♥️♥️♥️ pic.twitter.com/3eAdnxatWp— Varun Tej Konidela (@IAmVarunTej) September 18, 2023
La familia!♥️ pic.twitter.com/juwcAjCm11
— Varun Tej Konidela (@IAmVarunTej) October 7, 2023
Thanks to each & everyone for the warm wishes! ♾♥️
Thankful 🫶🏻 grateful pic.twitter.com/N4bw8WSSSm
— LAVANYA (@Itslavanya) June 13, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.