క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత గీతగోవిందం లాంటి డీసెంట్ హిట్ అందుకున్నాడు విజయ్. ఆతర్వాత మనోడు హిట్ రుచిచూడలేదు. భారీ అంచనాలు పెట్టుకున్న లైగర్ డిజాస్టర్ అయ్యింది. మినిమమ్ గ్యారెంటీ అనుకున్న ఖుషి సినిమా కూడా యావరేజ్ తో సరిపెట్టుకుంది. దాంతో విజయ్ నెక్స్ట్ సినిమా కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు విజయ్. తన సినిమా వివరాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాడు. తాజాగా ఐస్ బాత్ చేస్తోన్న ఫోటోను సోషల్ మీడియాలో వదిలాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.