Tollywood Latest : టాలీవుడ్ ప్రస్తుతం బోసి పోయింది. థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారో తెలియదు. సినిమా షూటింగులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియదు. దీంతో పరిశ్రమ అంతా వెలవెబోతుంది. అయితే వచ్చే నెల రోజుల్లో స్టార్ హీరోలు.. అభిమానులకు పలు కానుకలు అందిస్తున్నారు. ముందుగా సూపర్ స్టార్ మహేశ్ ఆగస్టు 9 న తన బర్త్ డే సందర్బంగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వనున్నారు. మహేశ్ తాజా మూవీ ‘సర్కారు వారి పాట’ సినిమా యూనిట్ అభిమానులకు ఓ కానుక సిద్దం చేస్తున్నట్లు సమాచారం. టైటిల్ ట్రాక్ రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్వాతంత్ర్య దినోత్సవం ఉంది. ఆ రోజున పలు కొత్త సినిమాల పోస్టర్లు, రకరకాల అనౌన్సిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్.ఆర్.ఆర్ నుంచి దేశభక్తికి సంబంధించి థీమ్ ఏదైనా అదే రోజు రిలీజైయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఉంది. ఆ రోజు అభిమానుల జోష్ మాములుగా ఉండదు. ఆచార్య ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజయ్యే అవకాశాలున్నాయి. ఇక చిరు తర్వాతి సినిమాల నుంచి అప్‌డేట్స్ రావొచ్చు. ఇక ఆగస్టు 29న కింగ్ నాగార్జున పుట్టినరోజు. ఆ రోజున నాగ్ ప్రస్తుతం నటిస్తోన్న వైల్డ్ డాగ్ మూవీ టీజర్ రిలిజయ్యే ఛాన్స్ ఉంది. ఇక సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఆ రోజున వకీల్ సాబ్ టీజర్ రావొచ్చు. క్రిష్ దర్శకత్వంలో చేస్తోన్న మూవీ నుంచి కూడా అప్‌డేట్ రావొచ్చు. ప్రస్తుతం వెలవెలబోతున్న సినీ ప్రేమికులకు ఈ అప్‌డేట్స్ కాస్త ఊరటనిస్తాయనే చెప్పకోవాలి.
Also Read : హెచ్‌సీయూ సంచలన నిర్ణయం : ఆన్‌లైన్ క్లాసుల కోసం విద్యార్థులకు ఆర్థిక సాయం